Gold Rates : బాబోయ్ ఇలా పెరుగుతున్నాయేటీ.. రోజురోజుకూ కొండెక్కుతున్న బంగారం ధరలు

నిన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళీ పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో దేశీయంగా కూడా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు తులం బంగారం ధర తులం మీద 500రూ. పెరిగింది.

Gold Rates : బాబోయ్ ఇలా పెరుగుతున్నాయేటీ.. రోజురోజుకూ కొండెక్కుతున్న బంగారం ధరలు
New Update

Gold And Silver Rates : తగ్గడం గోరంత...పెరగడం కొండంత అన్న చందంగా ఉన్నాయి బంగారం, వెండి ధరలు. నిన్న తగ్గడం ఏమో పది రూపాయలు తగ్గితే... ఇవాళ పెరగడం మాత్రం 500 రూ. పెరిగింది. రోజురోజుకూ దారుణంగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి పసిడి ధరలు(Gold Rates). అంతర్జాతీయ ధరలు రికార్డ్ స్థాయికి చేరుతున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం తీవ్రంగా పడుతోంది. అయితే దేశంలో ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్(Wedding Season) నడుస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం ధరలు అంతలా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం..

మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌(International Market) లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,406 డాలర్లు ఉంది. దీన్ని బేస్ చేసుకుని మన దేశంలో ఈరోజు 10 గ్రాముల 22 కేరెట్ల బంగారం ధర 500 రూపాయలు ఉండగా.. 24 కేరెట్ల పసిడి ధర 540 రూపాయలుగా ఉంది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 68,150 రూ.లు ఉండగా , 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 74, 340 దగ్గర ఉంది. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 68,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 74,490 గా నమోదైంది.

స్థిరంగా వెండి ధరలు..

బంగారం రేటు పెరిగినా వెండి ధరలు మాత్రం స్థినంగానే ఉన్నాయి. రెండు రోజులుగా దీని ధరలో మార్పులు లేవు. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్‌లో 86,500 ఉంది. దేశ రాజధానిలో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. అయితే ఈధరలు అన్నీ ఎలాంటి ఛార్జీలు లేకుండా చెప్పినవి మాత్రమే. వీటికి తోడు వ్యాట్, జీఎస్టీల్లాంటి అదనంగా యాడ్ అవుతాయి.అ ప్పుడు ఈ రేట్లు మరికొంత పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read:Madhya Pradesh: పోలింగ్ డ్యూటీ నుంచి తిరిగివస్తున్న బస్సు బోల్తా..21 మందికి గాయాలు

#gold-rates #international-markets #gold-and-silver-rates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe