Gold And silver Rates : తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశ వ్యాప్తంగా బంగారం ధరలు (Gold Rates) మళ్ళీ తగ్గాయి. గత వారం రోజుల్లో చూస్తే పసిడి రేటు బాగానే పడిపోయింది. గత కొన్ని నెలలుగా పసిడి ధర పెరుగుతూ పోయింది. జనాలు కొనడం కాదు కదా.. దాని మాట వినడానికే భయపడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ బంగారం రేట్లు దిగివస్తున్నాయి. వారం రోజుల్లో చూస్తే పసిడి రేటు బాగా పడిపోయింది. గ్లోబల్ మార్కెట్ (Global Market) లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం వల్ల మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు దిగి వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు మార్కెట్‌లో బంగారం ధర రూ. 210 మేర పతనమైంది. అదే ఆల్ టైం హై నుంచి చూస్తే ప్రస్తుతం 2200 రూపాయలు తక్కువ ధరలో లభిస్తోంది. హైదరాబాద్ (Hyderabad) లో ఈరోజు ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గి రూ.66,590గా దగ్గర ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి రూ. 72,640. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కూడా ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 పతనంతో రూ.66,740గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి రూ. 72,790 దగ్గర ఉంది.
వెండి...
బంగారం ధరతో పాటూ సిల్వర్ రేట్లూ (Silver Rates) తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి మీద 230 రూ. తగ్గి కిలో వెండి ధర రూ.96,100 దగ్గర ఉంది. మరోవైపు ఇంటర్నేషల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం 2348 డాలర్ల వద్ద ఉంది. అంటే ఇక్కడ ఒక్కరోజులో రేటు భారీగా పెరిగింది. స్పాట్ సిల్వర్ రేటు కూడా స్వల్పంగా పెరిగి 30.66 డాలర్ల దగ్గర ఉంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.093 వద్ద ఉంది.