Gold Rate Today : కొద్దిగా తగ్గిన బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతున్నాయంటే.. 

బంగారం ధరలు కాస్త నిదానించాయి. నిన్న పెరిగిన  ధరలు ఈరోజు తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,730ల వద్దకు చేరాయి.  ఇక వెండి ధర కేజీకి 700 తగ్గి  రూ.76,500 వద్ద ఉంది.

Gold Rate Today : కొద్దిగా తగ్గిన బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతున్నాయంటే.. 
New Update

Gold Price Today : బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉన్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి.  పెళ్లిళ్ల సీజన్ కావడం.. అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల వీటి మధ్య దేశీయంగా బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. పెద్దగా ఎక్కువ కాకున్నా.. 200 నుంచి 500 రూపాయల మధ్యలో బంగారం ధరలు పెరగడం.. తగ్గడం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈరోజు అంటే ఫిబ్రవరి 23న బంగారం ధరల్లో తగ్గుదల  కనబరిచింది.  బంగారం ధరల(Gold Rate today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం డిమాండ్ పెరుగుతూ ఉండడం బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 23న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate Today) స్వల్పంగా పెరిగింది.  అయితే, దేశీయంగా మాత్రం  బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు నిన్న పెరిగిన వెండి ధరలు ఈరోజు  తగ్గాయి.  ఈరోజు అంటే గురువారం (ఫిబ్రవరి 23) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.               

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) 100 రూపాయలు తగ్గింది. దీంతో  రూ.57,500ల వద్దకు చేరింది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 10 రూపాయలు తగ్గి  రూ. 62,730ల కు చేరుకుంది.  

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..

అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate today) తగ్గుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 100 రూపాయలు తగ్గి 10 గ్రాములకు రూ.57,650ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10రూపాయలు తగ్గుదల కనబరిచి రూ.62,880ల వద్దకు చేరుకుంది. 

Also Read : బంగారం దోబూచులాట.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది.. ఎంతంటే.. 

వెండి ధరలు ఇలా..

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate Today) తగ్గుదల నమోదు చేస్తుంటే మరోపక్క వెండి ధరలు కూడా ఈరోజు కిందికి దిగి వచ్చాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 700 రూపాయలు తగ్గి  రూ.76,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 700 రూపాయలు తగ్గింది .  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,000 లకు దిగివచ్చింది.  

అంతర్జాతీయంగా..

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate today)  2027డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త తగ్గడంతో(Gold And Silver Price) ఔన్స్ 22.94 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి.

Also Read : దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!!

#gold-and-silver-latest-prices #gold-rate-today #gold
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe