Gold Rate: మళ్ళీ తగ్గిన బంగారం.. నిలకడగా వెండి.. గోల్డ్ ఎంత తగ్గిందంటే.. 

భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గి రూ.58,000ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 110 తగ్గి రూ.63,250కు చేరింది. ఇక వెండి ధర రూ.78,000 వద్ద నిలకడగా ఉంది.

Gold Rate: మళ్ళీ తగ్గిన బంగారం.. నిలకడగా వెండి.. గోల్డ్ ఎంత తగ్గిందంటే.. 
New Update

Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. బంగారం కొనాలని అనుకునేవారికి రికార్డు స్థాయిలోకి వెళ్లిన బంగారం ధరలు ఇటీవల షాక్ ఇస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు కొద్ది కొద్దిగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. నిన్న పది గ్రాములకు 440 రూపాయల వరకూ తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా కాస్త తగ్గాయి.  బంగారం ధరల తగ్గుదల - పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rate) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. ఈరోజు అంటే జనవరి 06న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించడంతో  దేశీయంగాను బంగారం ధరలు దిగి వచ్చాయి. మరోవైపు నిన్న బాగా తగ్గిన వెండి ధరలు స్థిరంగా నిలిచాయి.  ఈరోజు అంటే శనివారం (జనవరి 06) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

హైదరాబాద్ లో బంగారం ధరలు:     

 హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 రూపాయలు తగ్గింది. దీంతో  రూ.58,000ల వద్ద చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం కూడా 110 రూపాయలు తగ్గి రూ. 63,420ల వద్దకు చేరింది.  అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి.  ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి రూ.58,150ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 130 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది దీంతో  రూ.63,250ల వద్దకు చేరుకుంది. 

Also Read: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. 

వెండి ధరలు ఇలా: 

ఇక నిన్న భారీగా పడిపోయిన వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.  దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు స్థిరంగా ఉంది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,600 లుగా నిలిచింది. 

 మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rate) నిలకడగా ఉన్నాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold and Silver)  2040 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

#gold-prie-in-hyderabad #gold-and-silver-price #gold-rate-today #gold-price-today
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe