Gold Rate Today: మరో పది రోజుల్లో దీపావళి (Diwali) పండుగ రాబోతుంది. ఈ క్రమంలో బంగారం(Gold) కొనాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు చుక్కలను తాకుతుంటే..ఇప్పుడు ఒక్కసారిగా ధరలు కిందకి దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి.
ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లలోనూ వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్లు (Gold Rate) భారీగా పతనం అయ్యాయి. తులం బంగారం రేటు ఏకంగా రూ. 1100 తగ్గింది. గత వారంలో వరుసపెట్టి పెరుగుతూ రికార్డు గరిష్టాలకు చేరి ఆందోళన కలింగించాయి. దీపావళి పండుగ ముందు బంగారం ధరలు వరుసగా దిగివస్తుండడంతో పసిడి ప్రియులు దీపావళికి భారీగా బంగారం కొనేందుకు ఎదురు చూస్తున్నారు.
Also read: ఘోర పడవ ప్రమాదం…18 మంది గల్లంతు..3 మృతదేహాలు లభ్యం!
దేశ వ్యాప్తంగా ఈ పండుగ సీజన్ లో ముడి బంగారంతో పాటు నగల రూపంలో కూడా ఎక్కువ సేల్ ఉంటుంది. పండుగ సీజన్ లో వెండికి సైతం మంచి డిమాండ్ ఉంటుంది. వెండి (Silver) కూడా నెమ్మదినెమ్మదిగా దిగి వస్తుంది. ఈ క్రమంలో రూపాయి విలువ మరింత పడిపోయింది. ప్రస్తుతం డాలర్ తో పోలీస్తే రూపాయి మారకం రూ. 83. 280 లుగా ఉంది.
హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడోరోజు దిగి వచ్చాయి. గురువారం నాడు మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు ఏకంగా రూ. 300 మేర తగ్గి ప్రస్తుతం రూ.56 వేల 400 వద్దకు దిగి వచ్చింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ. 320 తగ్గి ప్రస్తుతం రూ.61 వేల 530 వద్దకు చేరుకుంది.
గడిచిన మూడు రోజుల వ్యవధిలోనే తులం బంగారం ధర రూ.110 మేర తగ్గడం విశేషం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం దారిలోనే నడుస్తుంది. వెండి సైతం భారీగా దిగి వస్తోంది. గురువారం కిలో వెండి రేటు ఏకంగా రూ.1200 మేర పడిపోయాయి. ప్రస్తుతం రూ.74 వేల 100 వద్దకు దిగివచ్చింది.
ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్ లో రూ. 77 వేల వద్ద ఉండగా..ఢిల్లీలో హైదరాబాద్ లో వెండి రేటు చాలా ఎక్కువనే చెప్పాలి. బంగారం ధర మాత్రం తక్కువకే లభిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. ఢిల్లీలో కిలో వెండి రేటు గురువారం రూ.1200 మేర కిందకి దిగిరాగా..ప్రస్తుతం రూ.74 వేల 100 వద్దకు దిగివచ్చింది.
Also Read: వినియోగదారులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి, టమాటా ధరలు..రోజురోజుకి పైకి!
ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 300 పడిపోయి ప్రస్తుతం రూ. 56 వేల 550 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ. 310 పడిపోయి రూ. 61 వేల 680 వద్దకు దిగివచ్చింది.