Gold Prices Dropped Today : మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్(Marriage Season) మొదలవుతోంది. శుభకార్యాలకు షాపింగ్ చేసేవారు, బంగారం కొనేవారు(Gold Buyers) ఎక్కువగానే ఉంటారు. ఈ క్రమంలో పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు మార్కెట్ లో బాగా తగ్గాయని తెలుస్తుంది.
ఆదివారం నాడు మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 200 తగ్గి రూ. 58,100 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 220లు కిందకి తగ్గి రూ. 63, 380 లు వద్ద కొనసాగుతుంది. బంగారం ధరలు ఇలా ఉంటే వెండి కూడా రూ. 100 లు తగ్గి..కిలో వెండి ధర రూ. 76, 500 లుగా ఉంది.
రాజధాని నగరం ఢిల్లీ(Delhi) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold) ధర రూ. 58, 250 లుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63, 380 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ. 58,100 లు గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ. 63,380 లుగా ఉండగా..చెన్నై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,700 లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 64,040 లుగా ఉండగా.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,100 లు ఉండగా 24 క్యారెట్ల ధర రూ. 63,380 లుగా ఉంది.
మిగిలిన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర(Silver Rate) విషయానికొస్తే..వెండి కిలో రూ.100 లు మేర తగ్గి రూ. 76, 500 లుగా కొనసాగుతుంది. హైదరాబాద్(Hyderabad) లో కిలో వెండి రూ. 77,000 లుగా ఉండగా..విశాఖపట్నంలో రూ. 77,000 లుగా ఉండగా..చెన్నైలో కూడా రూ. 77,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ.73,000 వద్ద కొనసాగుతుంది.
Also read: భారీ అగ్ని ప్రమాదం..46 మంది మృతి..వేలాది ఇళ్లు దగ్ధం!