Gold Price Today : బంగారం నిలకడగా ఉంది.. వెండి కూడా అదే దారిలో! బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 90,000 గా ఉంది. By KVD Varma 06 Sep 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gold Price Are Stable Today : బంగారం ధరలు (Gold Rates) ఇటీవల కాలంలో తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న కూడా కొద్దిగా తగ్గుదల కనబరిచింది బంగారం. ఇక ఈరోజు మాత్రం బంగారం ధరలు ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నాయి. కొన్నిరోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న వెండి కూడా ఈరోజు బంగారం బాటలోనే నిలిచింది. వెండి ధరల్లో ఎటువంటి మార్పూ లేదు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 6న బంగారం ధరలు స్థిరంగా ఉండి బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్రభావం ఎప్పటిలానే మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్పులు లేకుండా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా స్థిరంగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎటువంటి మార్పూ లేకుండా కొనసాగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. . ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,690 24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,460 ఇక విజయవాడ , విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి . 22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,690 24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,760 దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగొచ్చాయి. ఈరోజు తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 66,840 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 72,910 Gold Price Today: బంగారం ధరలు కొద్దిగా నిలకడగా ఉండగా, మరోవైపు వెండి ధరలు కూడా ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా నిలిచాయి. హైదరాబాద్ లోనూ , ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో వెండి ధర (Silver Price) కేజీకి.. ₹ 90,000 గానూ , ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 85,000 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి . ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు అంటే సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,516 డాలర్ల వద్ద ఉన్నాయి. అలాగే వెండి ధరలు ఒక్కసారే పెరిగాయి. దీంతో కేజీకి 926 డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. Also Read : క్రూడాయిల్ ధరలు పై పైకి.. మన దేశంలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. #gold-rate #gold-and-silver-latest-prices #gold-rate-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి