Gold Price: బంగారం గత వారం కాస్త తగ్గినట్టే కనిపించింది.. ఇప్పటి రేట్లు ఎంతో తెలుసా? 

బంగారం ధరలు గతవారం కాస్త తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 56,500గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 61,640 రూపాయల వద్ద వుంది. 

New Update
Gold Price: బంగారం గత వారం కాస్త తగ్గినట్టే కనిపించింది.. ఇప్పటి రేట్లు ఎంతో తెలుసా? 

Gold Rate: బంగారం అంటే మన దేశంలో విపరీతమైన క్రేజ్. ముఖ్యంగా పండగల సమయం అదీ దీపావళి పండగ వచ్చిందంటే భారతీయ మహిళలు బంగారం కొనాలని ముచ్చట పడతారు. అందుకే బంగారానికి ఈ సీజన్ లో డిమాండ్ పెరుగుతుంది. దీంతో ధరలూ పెరుగుతాయి. నిజానికి బంగారం, వెండి ధరలు నిత్యం పైకీ కిందికీ కదులుతూనే ఉంటాయి. అయితే మొత్తంగా చూసుకుంటే బంగారం ధర గతం కంటే బాగా పెరిగింది. జీవితకాలపు గరిష్ట స్థాయిలో బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతవారం బంగారం ధరల విషయాన్ని పరిశీలించినట్లయితే, వారం మొదటితో పోలిస్తే చివరికి వచ్చేసరికి బంగారం ధరలు(Gold Price) తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు.  ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్‌లో, ఈ వారం ప్రారంభంలో, అంటే అక్టోబర్ 30 న, బంగారం రూ. 61,336 వద్ద ఉంది, ఇది ఇప్పుడు నవంబర్‌4 వ తేదీ కి 10 గ్రాములకు రూ. 61,075 కి తగ్గింది. అంటే ఈ వారం దీని ధర రూ.261 తగ్గింది.

వెండి కూడా రూ.71 వేల దిగువకు పడిపోయింది.

ఐబిజెఎ వెబ్‌సైట్ ప్రకారం, ఈ వారం వెండి ధర రూ.900 కంటే ఎక్కువ పతనం కనిపించింది. ఈ వారం ప్రారంభంలో రూ.71,733 ఉండగా, ప్రస్తుతం కిలో రూ.70,771కి తగ్గింది. అంటే ఈ వారం దీని ధర రూ.962 తగ్గింది.

ఇక ఈరోజు అంటే నవంబర్ 6 వ తేదీన  బంగారం, వెండి  ధరల(Silver Price) విషయానికి వస్తే.. హైదరాబాద్ లో బంగారం ధరలు ఆదివారం నాటి ధరల దగ్గరే స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 56,500గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 61,640 రూపాయల వద్ద వుంది. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఢిల్లీలో  రూ. 56,650ల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 61,790 రూపాయలుగా ఉంది. 

Also Read: ఫస్ట్ సాలరీ వచ్చిందా? ఇలా చేస్తే ఎప్పుడూ డబ్బు ఇబ్బంది ఉండదు.. 

మరోవైపు వెండి రేట్లు కూడా యథాతథంగానే ఉన్నాయి. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 78,000 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 75 వేల రూపాయలుగా నిలిచింది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర(Gold Price) స్థిరంగానే ఉంది. బంగారం ధర ఔన్సుకు 1990 డాలర్ల వద్ద ఉంది.  అలాగే వెండి కూడా  23.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

బంగారం, వెండి ధరలు(Gold Price) ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా వచ్చే సమస్యలు.. రూపాయి విలువ.. డిమాండ్.. స్థానిక పన్నులు ఇలాంటి అనేక కారణాలతో బంగారం ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి. బంగారం, వెండి కొనాలని అనుకునేటప్పుడు స్థానిక మార్కెట్ ధరలను చెక్ చేసుకోవడం మంచిది.

Watch this special video:

Advertisment
తాజా కథనాలు