Gold: ఒక్క రోజులో భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా?

బంగారం ధరలపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం తగ్గిస్తున్నట్లు కేంద్రం నిన్న బడ్జెట్ లో ప్రకటించింది.దీంతో ఈరోజు దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940 గా కొనసాగుతోంది. కిలో వెండి ధరపై ఏకంగా 9వేలకు పైగా తగ్గి రూ.87,900 కు చేరింది.

New Update
Gold: ఒక్క రోజులో భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా?

Gold Price Dropped: కేంద్ర బడ్జెట్‌లో బంగారం ధరలపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈరోజు జూలై 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5316 కు చేరింది.

దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850 ఉంది.నిన్న బడ్జెట్‌ కారణంగా కిలో వెండి ధరపై ఏకంగా 9వేలకుపైగా తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం వెయ్యి రూపాయలు తగ్గింది. తాజాగా కిలో వెండి ధర రూ.87,900 వద్ద కొనసాగుతోంది.

Also Read: వీధి కుక్కలు దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి..?

Advertisment
తాజా కథనాలు