Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయంటే!

శనివారం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం తో పోలిస్తే ధరలు కాస్త అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తుంది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది.

New Update
Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయంటే!

Gold Rates: పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం తో పోలిస్తే ధరలు కాస్త అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తుంది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది. శుక్రవారం లాగే తులంపై రూ. 10 తగ్గింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలెలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా...

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,190, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,290గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 73,140 వద్ద నడుస్తుంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 గా ఉంది.

బంగారం మాదిరిగానే వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. దేశంలోని చాలా నగరాల్లో కిలో వెండి రూ.100 మేర తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,900గా ఉంది. ముంబయిలో రూ. 88,300, బెంగళూరులో రూ. 87,600 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 92,900 వద్ద ట్రేడవుతోంది.

Also Read: పెట్రోల్ రేట్లు మారలేదు.. ప్రస్తుతం ఎంతంటే.. 

Advertisment
తాజా కథనాలు