/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Gold-1-jpg.webp)
Hyderabad: తెలంగాణలో ఇప్పుడంతా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఏ పార్టీ గెలుస్తుందని జనాలు చర్చించుకుంటుంటే.. మనమే గెలవాలంటూ రాజకీయ పార్టీలు తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారీగా డబ్బు, మద్యం, బంగారం, వెండి ఆభరణాలు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈసీ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. తాతాజాగా చందానగర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కొందరు అనుమానాస్పదంగా కనిపించడంతో అడ్డుకున్నారు పోలీసులు. వారి వాహనాన్ని తనిఖీ చేయగా భారీ స్థాయిలో బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.
దాదాపు 29 కేజీ బంగారం, 26 కేజీల వెండిని పోలీసులు సీజ్ చేశారు. గంగారంలో మంగళవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో ఈ ఆభరణాలు పట్టుబడ్డాయి. అయితే, పట్టుబడిన నగలన్నీ చందానగర్ పరిధిలోని మలబార్, కళ్యాణ్, లలిత, రిలయన్స్ రిటైల్, విరాజ్ జ్యువలర్స్ షాపులకు సంబంధించినదిగా తెలుస్తోంది. వీటిని హైదరాబాద్ నుంచి ముంబయి, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మొత్తంగా ఈ ఆభరణాలను సీజ్ చేసి, వాటిని తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు.
TSNAB APPREHENDED (04) Persons, Seized (1000) Kg's of Ganja, (01) DCM, (01)car, and (04)Mobile Phones.@TelanganaDGP @CPHydCity @CVAnandIPS@narcoticsbureau @cyberabadpolice @RachakondaCop @TelanganaCOPs@NMBA_MSJE @hydcitypolice @UNODC@TelanganaCMO @HYDTP#DrugfreeTelangana. pic.twitter.com/I0vpEhSmmO
— Telangana Anti Narcotics Bureau (@TS_NAB) October 17, 2023
ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఎన్నికలకోడ్ లో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా వాహనాల తనిఖీలు చేస్తూ నిబంధనల్ని అతిక్రమించి ఎక్కువ మొత్తంలో తరలిస్తున్న నగదును కరీంనగర్ జిల్లాపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.@CEO_Telangana @ECISVEEP pic.twitter.com/7G9PTMo4K5
— Telangana State Police (@TelanganaCOPs) October 17, 2023
Also Read: