Gold and Silver Rate: గత వారం దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్సైట్ ప్రకారం, ఈ వారం ప్రారంభంలో, అంటే నవంబర్ 28 న బంగారం రూ .61,895 వద్ద ఉంది. ఇది ఇప్పుడు డిసెంబర్ 2 న 10 గ్రాములకు రూ .62,728 కు చేరుకుంది. అంటే ఈ వారం దీని ధర రూ.833 పెరిగింది. అంతే కాదు ఇది ఆల్ టైమ్ గరిష్ట బంగారం కూడా. ఐబీజేఏ వెబ్సైట్ ప్రకారం, వెండి గత వారం వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఈ వారం ప్రారంభంలో కిలో రూ.74,993 ఉండగా, ప్రస్తుతం రూ.76,400కు చేరింది. అంటే ఈ వారం దీని ధర రూ.1,407 పెరిగింది.
ఇక హైదరాబాద్ లో కూడా బంగారం ధరలు(Gold and Silver Rate) గత వారంలో భారీగా పెరిగాయి. గత వారంలో 10 గ్రాములపై ఏకంగా రూ. 1300కుపైగా పెరిగింది. వారం మొత్తంలో ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులూ బంగారం దార్లు పెరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. ఈరోజు అంటే సోమవారం (డిసెంబర్ 4) ఉదయం మార్కెట్ ప్రారంభమయ్యే సరికి హైదరాబాద్ లో బంగారం ధరలు నిలకడగా గతవారం ముగింపు ధరల వద్ద ఉన్నాయి. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,450 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 63,760 మార్కు వద్ద మార్పులేకుండా ఉన్నాయి.
Also Read: బాబోయ్ అనిపిస్తున్న బంగారం.. గోల్డ్ ఎందుకు? ఇది చాలు అంటున్న యువత!
అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 83,500 వద్ద స్థిరంగా ఉంది. ఇది కూడా రికార్డు స్థాయి కావడం గమనార్హం.
ఇక అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరల పరుగు కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర ఔన్సుకు 2086 డాలర్ల వద్ద ఉంది. ఇది 2100 డాలర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇక వెండి ధర ఔన్సుకు 25.50 డాలర్ల వద్ద ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు(Gold and Silver Rate) ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, అంతర్జాతీయంగా వచ్చే మార్పులు.. స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం. అలాగే బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ చూసి కొనుగోలు చేయడం తప్పనిసరి.
Watch this interesting Video: