Gold and Silver: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు..  

వరుసగా రెండోరోజూ  బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద ఉన్నాయి.  ఇక వెండి ధర కేజీకి రూ.200లు తగ్గి  రూ.77,000 వద్ద ఉంది.

Gold Rate: భారీగా పెరుగుతున్న గోల్డ్,సిల్వర్ ధరలు!
New Update

Gold and Silver: కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చి ఆశలు రేపిన బంగారం మధ్యలో కొద్దిగా పెరిగినా.. మళ్ళీ వరుసగా తగ్గుతూ వచ్చింది. దీంతో బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట దొరికింది. అయితే, మళ్ళీ బంగారం ధరలు కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. బంగారం కొనాలనుకునేవారిలో ఆందోళన పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం.. దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. అంతకు ముందు వరుసగా మూడురోజులు తగ్గిన బంగారం ధరలు నిన్న పెరిగిన విషయం తెలిసిందే. ఈరోజు ఈరోజు అంటే జనవరి 21న కూడా బంగారం పెరుగుదలకనబరిచింది.  బంగారం ధరల(Gold and Silver)తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా  ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 20న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate)స్వల్పంగా పెరిగింది.  దీంతో  దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం  ఈరోజు తగ్గాయి.  ఈరోజు అంటే ఆదివారం (జనవరి 21) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold and Silver) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.          

హైదరాబాద్ లో బంగారం ధరలు:
హైదరాబాద్(Hyderabad) లో రెండోరోజూ బంగారం ధరలు కాస్త పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver) 100 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.57,800ల వద్దకు చేరింది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు1000 రూపాయలు పెరిగి  రూ. 63,050ల కు చేరుకుంది.   అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate News) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 100 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.57,950ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.63,200ల వద్దకు చేరుకుంది. 

Also Read: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

వెండి ధరలు ఇలా:
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold and Silver) పెరుగుదల నమోదు చేస్తుంటే వెండి ధరలు ఈరోజు తగ్గుదల  నమోదు చేశాయి.  హైదరాబాద్ లో వెండి కేజీకి 200 రూపాయలు తగ్గి రూ.77,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 200 రూపాయలు తగ్గింది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,500 లకు చేరుకుంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price)  2029.63డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.61 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

#gold #gold-price #silver
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe