Gold and Silver Price: బంగారం దోబూచులాట.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది.. ఎంతంటే.. 

బంగారం ధరలు అనిశ్చితంగా కదులుతున్నాయి. నిన్న తగ్గిన ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,740ల వద్దకు చేరాయి.  ఇక వెండి ధర కేజీకి 200 పెరిగి  రూ.77,200 వద్ద ఉంది.

New Update
Gold and Silver Price: బంగారం దోబూచులాట.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది.. ఎంతంటే.. 

Gold and Silver Price Today: బంగారం ధరలు అనిశ్చితంగా కదులుతున్నాయి. ఒకరోజు పెరగడం.. ఒకరోజు తగ్గడం అన్నట్టుగా ఈ మధ్య ధరల తీరు ఉంది. పెళ్లిళ్ల సీజన్ కావడం.. అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల వీటి మధ్య దేశీయంగా బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. పెద్దగా ఎక్కువ కాకున్నా.. 200 నుంచి 500 రూపాయల మధ్యలో బంగారం ధరలు పెరగడం.. తగ్గడం జారుతుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈరోజు అంటే ఫిబ్రవరి 22న బంగారం పెరుగుదల కనబరిచింది.  బంగారం ధరల(Gold and Silver Price) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం డిమాండ్ (Gold Demand) పెరుగుతూ ఉండడం బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 22న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.  దీంతో  దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు రెండురోజుల పాటు తగ్గుతూ వచ్చిన వెండి ధరలు (Silver Price) ఈరోజు కాస్త  పెరిగాయి.  ఈరోజు అంటే గురువారం (ఫిబ్రవరి 22) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు  దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 250 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.57,600ల వద్దకు చేరింది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 180రూపాయలు పెరిగి  రూ. 62,740ల కు చేరుకుంది.  

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో (Delhi) కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 250 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.57,750ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 180రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.62,890ల వద్దకు చేరుకుంది. 

Also Read : గోల్డ్ లవర్స్ రిలాక్స్.. బంగారం ధర తగ్గింది.. వెండి కూడా.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు (Gold Rate Today) పెరుగుదల నమోదు చేస్తుంటే మరోపక్క వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 200 రూపాయలు పెరిగి  రూ.77,200ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 200 రూపాయలు పెరిగింది .  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,700 లకు చేరుకుంది. .  

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం 2027డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త తగ్గడంతో  ఔన్స్ 22.94 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి.

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు