Summer Tips:వేసవిలో జిమ్ కు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

జిమ్‌కు వెళ్లడం మంచిదే అయినప్పటికీ ఎండకాలంలో మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సమ్మర్‌లో జిమ్మింగ్ విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

New Update
Summer Tips:వేసవిలో జిమ్ కు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Summer Gym Tips: కరోనా తర్వాత తీసుకునే ఆహారం మొదలు జీవనశైలి వరకు అన్నింట్లో మార్పులు చేసుకుంటున్నారు. అంతకు ముందు ఎప్పుడూ అలవాటు లేని వారు కూడా జిమ్‌ల బాటపడుతున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడం మంచిదే అయినప్పటికీ ఎండకాలంలో మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సమ్మర్‌లో జిమ్మింగ్ విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సమ్మర్‌లో జిమ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిలో ప్రధానమైంది ఒకేసారి ఎక్కువ వర్కవుట్స్‌ చేయకూడదు. సహజంగానే సమ్మర్‌లో డీహైడ్రేష్‌ కారణంగా శరీరం వీక్‌ అవుతుంది. దీనికి తోడు ఎక్కువ సమయం జిమ్‌ చేస్తే మరింత వీక్‌ అవుతారు. కాబట్టి సాధారణ రోజులతో పోల్చితే వర్కవుట్స్‌ను కాస్త తగ్గించడం ఉత్తమం.ఇక డీ హైడ్రేషన్‌కు గురికాకుండా నిత్యం లిక్విడ్‌ను తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లే ముందు, జిమ్‌లో వర్కవుట్స్‌ పూర్తయిన తర్వాత లిక్విడ్‌ రూపంలో ఏదైనా తీసుకోవాలి. దీనికి కారణంగా వర్కవుట్స్‌ కారణంగా శరీరం కోల్పోయే నీటిని బ్యాలెన్స్ చేయడానికే.
అలాగే జిమ్‌కి వెళ్లిన సమయంలో ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బిగుతుగా ఉండే దుస్తులకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు గాలి బాగా అందేలా వదులు దుస్తులను ధరించాలి.ఇక ఎండకాలంలో జిమ్‌ చేసే వారు తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ లు ఉండే ఫుడ్ ను తీసుకొవాలి. వర్కవుట్స్‌ తర్వాత గుడ్లు, అరటి పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఇక ఎక్కువ సేపు కంటిన్యూగా వర్కవుట్స్‌ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మధ్య మధ్యలో బ్రేక్‌ ఇస్తూ వర్కవుట్స్‌ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
Advertisment
తాజా కథనాలు