మానవ శరీరానికి వ్యాయామం ఎంతో ముఖ్యమైనది. శరీర బరువును తగ్గించడానికి కండరాలను దృఢంగా దృఢంగా ఉంచడానికి రోగ నిరోధక శక్తిని వృద్ధి చేయడానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుంది. వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మధుమేహం, హైబీపీ, ఊబకాయం వంటి ప్రమాదకర ముప్పులు నయమవుతాయి. అందుకు ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి జిమ్ కు వెళ్తుంటారు. కండరాలను, సిక్స్ ప్యాక్ బాడీని పెంచుతుంటారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా యువత జిమ్ కువెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంత మంది మాత్రం జిమ్ కు వెళ్లి గంటల తరబడి జిమ్ చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా శరీరానికి ప్రభావం చూపుతోందని వరంగల్ నగరానికి చెందిన ఫిట్‌నెస్ జోన్ జిమ్ ట్రైనర్ అవన్ రెడ్డి తెలిపారు.
ఇక శాకాహారంలో పాలకూర, రాజ్మా, పెసర్లు, సోయా బీన్స్ ఇలా పలు రకాల ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అయితే జిమ్ చేసేవారు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.