Health Tips: జిమ్ కు వెళ్లే వారు ఈ తప్పులు చేయకండి! నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, అందమైన శరీరాకృతిని పొందటానికి జిమ్‌కు క్యూకడుతుంటారు. కానీ జిమ్‌కు వెళ్తున్నవారు ఈ తప్పులు చేస్తే చిక్కులు మాత్రం తప్పవు. అవేంటో ఒకసారి తెలుసుకోండి! By Durga Rao 12 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మానవ శరీరానికి వ్యాయామం ఎంతో ముఖ్యమైనది. శరీర బరువును తగ్గించడానికి కండరాలను దృఢంగా దృఢంగా ఉంచడానికి రోగ నిరోధక శక్తిని వృద్ధి చేయడానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుంది. వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మధుమేహం, హైబీపీ, ఊబకాయం వంటి ప్రమాదకర ముప్పులు నయమవుతాయి. అందుకు ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి జిమ్ కు వెళ్తుంటారు. కండరాలను, సిక్స్ ప్యాక్ బాడీని పెంచుతుంటారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా యువత జిమ్ కువెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంత మంది మాత్రం జిమ్ కు వెళ్లి గంటల తరబడి జిమ్ చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా శరీరానికి ప్రభావం చూపుతోందని వరంగల్ నగరానికి చెందిన ఫిట్‌నెస్ జోన్ జిమ్ ట్రైనర్ అవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగామాట్లాడుతూ ప్రతి రోజు గంట పాటు జిమ్ చేస్తే సరిపోతుందన్నారు. ఎక్కువ సేపు గంటల తరబడి జిమ్ చేయడం ద్వారా శరీరానికి ప్రభావం చూపుతుందన్నారు. ఇలా చేయడం కండరాల ఎదుగుదలపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు. కొంత మంది యువత త్వరగా తమ కండలను పెంచుకోవాలనే ఉద్దేశంతో గంటల తరబడి జిమ్ చేస్తుంటారని అలా చేయవద్దన్నారు. ప్రతిరోజు గంట పాటు జిమ్ చేస్తే సరిపోతుందన్నారు. అదేవిధంగా జిమ్ చేసేవారు తగిన మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఆహారా పదార్థాలను తీసుకోవాలన్నారు. మాంసాహారంలో చికెన్ తో పాటు వారానికి ఒకరోజు మటన్ తినవచ్చన్నారు. అదే విధంగా రెడ్ మీట్ కు దూరంగా ఉండాలన్నారు. చికెన్ తినేవారు అందుకు ధీటుగా సలాడ్స్, అలాగే ఎక్కువ మోతాదులో నీరు త్రాగాలన్నారు. ఇక శాకాహారంలో పాలకూర, రాజ్మా, పెసర్లు, సోయా బీన్స్ ఇలా పలు రకాల ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అయితే జిమ్ చేసేవారు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. #health-tips #fitness #gym మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి