High Heels: అమ్మాయిలు హైహీల్స్ వేసుకుంటున్నారా..? అయితే రిస్క్‌ మీకే

ఫ్యాషన్‌, అందం, మోడ్రన్‌, మంచిలుక్‌ కోసం అమ్మాయిలు హైహీల్స్ వేసుకుంటూ ఉంటారు. హైహీల్స్ వేసుకునేటప్పుడు ఎక్కువ టైట్ ఉన్నవి వసుకుంటే ఒత్తిడి పెరిగి శరీర బరువు పాదాలపై పడి అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

High Heels: అమ్మాయిలు హైహీల్స్ వేసుకుంటున్నారా..? అయితే రిస్క్‌ మీకే
New Update

High Heels: అమ్మాయిలు మీరు హైహీల్స్ వేసుకుంటున్నారా..? అయితే ఇకనుంచి జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఫ్యాషన్‌, అందం, మోడ్రన్‌, మంచి లుక్‌ కోసం చూస్తే రిస్క్‌ మీకు తప్పందటున్నారు. హైహీల్స్ వేసుకునే వాళ్లకు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి అమ్మాయి అందంగా ఉండటానికి, ఫ్యాషన్‌గా కనిపించడానికి అనేక రకాలుగా దుస్తులు, హెయిర్ స్టైల్, హైహీల్స్‌ను వేసుకుంటారు. ఈ విధంగా ధరించిన అమ్మాయిలు మోడ్రన్‌గా మంచి లుక్‌లో కనిపిస్తారు. కానీ 2,3 అంగుళాల ఎత్తు ఉండే హైహీల్స్ దరిస్తే ఇంకా మోడల్‌గా కనిపిస్తారమో కానీ వీటివల్ల ఫ్యాషన్, స్టైల్‌ పోయి అనేక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అమ్మాయిలు హైహీల్స్ వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

high heels problems ప్రతీకాత్మక చిత్రం

హైహీల్స్‌ ఎంత తక్కువగా వాడితే ఆరోగ్యానికి మేలు:

  • వేసుకున్న డ్రస్స్‌ అందాన్ని పెంచాలంటే హైహీల్స్ వేసుకోవాల్సిందే. అయితే ఈ ఎత్తు చెప్పులు వాడకం ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యానికి మేలు. లేదంటే పాదాల సమస్య వస్తుంది. ఇది ఒత్తిడిని పెంచడమే కాకుండా,శరీర బరువు పాదాలపై పడి అనేక సమస్యలకు దారి తీసుకొస్తుంది.
  • ఒకవేళ ఎంత చెప్పులు వేసుకోవాలని ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని వేసుకుంటే సమస్యను కొంచెం తగ్గించుకోవచ్చు.
  • మొదటిసారి ఎత్తు చెప్పులు కొనేవాళ్ళు మూడు అంగుళాలకు ఉన్నవి తీసుకోవద్దు. హైహీల్స్ 2 అంగుళాలు దాటకుండా చూసుకోవాలి. దీనివల్ల ఎక్కువసేపు నడవాలన్నా, నిలబడాలన్న ఇబ్బందిగా ఉంటుంది.
  • హైహీల్స్ వేసుకునేటప్పుడు ఎక్కువ టైట్, ఎక్కువ వదులు ఉన్న చెప్పుల్ని వేసుకోకూడదు. దీనివల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కరెక్ట్‌ సైజును వెంచుకోవాలి.
  • రోజంతా హైహీల్స్ వేసుకోవాల్సి వస్తే.. సమయం దొరికినప్పుడల్లా వాటిని విడిచి పాదాలను గుండ్రంగా తిప్పడం, ముందుకు వంచడం లాంటివి చేస్తే మంచిది. దీనివల్ల పాదాలు కొంత ఆరోగ్యంగా ఉంటాయి.
  • మన శరీరం బరువుని పాదాలే మోస్తాయి. హైహీల్స్ వేసుకుంటే చూడ్డానికి స్టైల్‌గా కనిపించిన ఎత్తు పెరిగే కొద్దీ భారం మొత్తం పాదాలపై పడుతుంది. అందుకని ఎత్తు చెప్పులు రోజు కాకుండా సందర్భాన్ని బట్టి వాడితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  కళ్లలో కారం పడితే మంట ఎందుకు వస్తుందో తెలుసా..?

#high-heels
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe