Waxing Tips: వ్యాక్స్‌ చేయించుకున్నాక అమ్మాయిలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

చర్మంపై అవాంఛిత రోమాలు లేకుండా మృదువుగా కనిపించేలా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారింది. నెలకోసారి బ్యూటీపార్లర్‌కి వెళ్లి వ్యాక్సింగ్‌ చేయించుకుంటూ ఉంటారు. అయితే వ్యాక్స్‌ తర్వాత అమ్మాయిలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకోండి.​

New Update
Waxing Tips: వ్యాక్స్‌ చేయించుకున్నాక అమ్మాయిలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

Waxing Tips: చాలా మంది మహిళలు వాక్స్ చేయించుకున్న అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు, చిన్న బొబ్బలు మొదలైనవి వస్తుంటాయి. వీటిని కొన్ని చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. అందంగా కనిపించడానికి మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పార్లర్లలో విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. వేసవి వచ్చిందంటే చాలు అమ్మాయిలు పొట్టి డ్రెస్సులు వేసుకోవడం మొదలుపెడతారు. అలాంటి పరిస్థితిలో చర్మంపై అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి వ్యాక్స్ చేయించుకుంటారు. కొందరు స్త్రీలు ఇంట్లోనే తొలగించుకుంటారు. దీని వల్ల కొన్ని చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

Waxing Tips

ఇలా జాగ్రత్త పడండి:

వ్యాక్స్‌ (Waxing) చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలాగే చర్మం నుంచి జుట్టు అంతా శుభ్రం అవుతుంది. కానీ కొన్నిసార్లు చర్మంపై చిన్న ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. కొంతమంది మహిళలకు దద్దుర్లు ఒకటి లేదా రెండు రోజుల్లో నయమవుతాయి. అయితే కొందరికి చాలా వారాలు పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వ్యాక్స్‌కు ఒక రోజు ముందు తేలికగా స్క్రబ్ చేయాలి. దీనివల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. దీంతో వ్యాక్స్‌ సులభంగా చేయవచ్చు. వ్యాక్స్‌కు ముందు ఎలాంటి ఆయిల్ లేదా క్రీమ్ రాసుకోవద్దని నిపుణులు అంటున్నారు.

Waxing Tips

వ్యాక్స్‌ తర్వాత జాగ్రత్తలు:

వ్యాక్స్‌ తర్వాత కొన్ని రోజులు సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. దీనివల్ల చర్మం ఎరుపు రంగులోకి మారకుండా ఉంటుంది. వ్యాక్స్‌ చేసే వారికి అనుభవం ఉందా లేదా అనేది చూసుకోవాలి. శరీరంలోని చిన్న భాగంపై కొద్దిగా వ్యాక్స్‌ చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేది చెక్‌ చేసుకోవాలి. ఏదైనా చర్మ సమస్య లేదా అలెర్జీ ఉంటే వ్యాక్సింగ్‌కు ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: గర్భిణులు చికెన్‌ తినవచ్చా..వైద్యులు ఏం చెబుతున్నారు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు