Madhya Pradesh : 200 అడుగుల బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి!

మధ్యప్రదేశ్‌లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది.బావిలో పడిన బాలికను రైతు పింటూ సాహు కుమార్తె శౌమ్యగా అధికారులు గుర్తించారు.పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ చిన్నారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.

Madhya Pradesh : 200 అడుగుల బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి!
New Update

3 Years Old Girl Fall Into Borewell : మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ చిన్నారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.

సాయంత్రం 4 గంటలకు పాప పుట్టినరోజు (Birthday) వేడుకల కోసం బంధువులు , తల్లిదండ్రులు అంతా సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పాప 18-20 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పైపుల ద్వారా బావిలోకి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. బోరుబావి 200 అడుగుల లోతు ఉన్నట్లు సమాచారం. బావిలో పడిన బాలికను రైతు పింటూ సాహు కుమార్తె శౌమ్యగా అధికారులు గుర్తించారు.

ఘటన జరిగిన వెంటనే బోరుబావి నుంచి బాలికను రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలను అధికారులు మొదలు పెట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. బాలికను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీబీల ద్వారా బోరుబావి (Borewell) కి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. సాహు ఇంటికి సమీపంలో గతేడాది బోరు వేసినప్పటికీ నీరు పడకపోవడంతో బోరు బావిని మట్టితో కప్పేశారు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు మట్టి కిందకు దిగడంతో బావిలో 20-25 అడుగుల గుంత ఏర్పడింది.

Also read:  ఆటో డ్రైవర్‌ తో గొడవ..గుండె ఆగి చనిపోయిన శివసేన నేత కుమారుడు!


#madhyapradesh #borewell #girl-child
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe