Ginger Side Effects: అతిగా అల్లం తింటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?!

శీతాకాలంలో చాలా మంది ప్రజలు అల్లం టీ తాగుతుంటారు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను పెంచుతుందని, జలుబు తగ్గుతుందని అల్లంను వినియోగిస్తారు. అధికంగా అల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, మితంగా వాడాలని సూచిస్తున్నారు వైద్యులు.

New Update
Ginger immunity

Ginger Side Effects: వాతావరణంలో మార్పు వచ్చినప్పుడల్లా సీజనల్ వ్యాధులు ప్రజలను అల్లకల్లోలం చేస్తాయి. వర్షాకాలం, వేసవి కాలం మాదిరిగానే శీతాకాలం కూడా అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. వేసవిలో వేడి వస్తువులకు దూరంగా పారిపోయే వ్యక్తులు, శీతాకాలంలో వాటికి దగ్గరవుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్‌లో వేడి పదార్థాలు తినడం, వేడి వేడి డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి వేడి అందుతుందని. శరీర ఉష్ణోగ్రతను పెంచేందుకు, చలిని తట్టుకునేందుకు శీతాకాలంలో, ప్రజలు ఎక్కువగా అల్లం టీ, అల్లం డికాక్షన్ తాగుతారు. అల్లం వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జలుబు కూడా తగ్గుతుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయని మీకు తెలుసా? అల్లం అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే సమస్యల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

అల్లం అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలు ఇవి..

1. కడుపు ఉబ్బరం: అల్లం శరీరానికి వెచ్చదనాన్ని అందించినప్పటికీ, దానిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. యాసిడ్ ఏర్పడటం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఆహారం తిన్న తర్వాత తక్కువ మోతాదులో అల్లం తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది.

2. రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేస్తుంది: అల్లంలో రక్తాన్ని పల్చగా చేసే గుణాలు ఉన్నాయి. అయినప్పటికీ, దాని అధిక వినియోగం రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తాన్ని పలుచన చేసే మందులను వాడేవారిలో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి.

3. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు: ఆహారంలో అధికంగా అల్లం చేర్చడం వల్ల ఇన్సులిన్ స్థాయిలలో ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గిపోవచ్చు.

4. నోటిలో మంట: అల్లం ఎక్కువగా తీసుకుంటే నోటిలో మంట ఏర్పడుతుంది. అందుకే, వీలైనంత వరకు పరిమిత పరిమాణంలో అల్లం ఉపయోగించండి.

గమనిక: ఈ వార్తలో పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య నిపుణుల తెలిపిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని RTV ధృవీకరించడం లేదు.

Also Read:

నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు