గిల్‌ పేరిట అరుదైన రికార్డు!

వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ... భారత్ యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ఒక ప్రపంచ రికార్డును సాధించాడు. పాకిస్థాన్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్ పేరిట ఉన్న వ‌న్డే రికార్డును ఇండియ‌న్ బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్ బ్రేక్ చేశాడు.

New Update
Ind Vs Pak World Cup 2023:స్టార్ వచ్చేస్తున్నాడు...ఇషాన్, సిరాజ్ డౌటే.

వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ... భారత్ యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ఒక ప్రపంచ రికార్డును సాధించాడు. పాకిస్థాన్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్ పేరిట ఉన్న వ‌న్డే రికార్డును ఇండియ‌న్ బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్ బ్రేక్ చేశాడు.

వన్డేల్లో 26 ఇన్నింగ్స్ లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. 26 ఇన్నింగ్స్ లలో గిల్ 1,352 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో బాబర్ పేరిట ఉన్న 1,322 పరుగుల రికార్డును అధిగమించాడు.

గిల్‌, బాబ‌ర్ త‌ర్వ‌తా స్థానాల్లో జొనాథ‌న్ ట్రాట్‌(1303), ఫ‌క‌ర్ జ‌మాన్‌(1275), వాండ‌ర్ దుస్సేన్‌(1267) ఉన్నారు. దీంతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ శుభారంభాన్ని అందించారు.

ఒకానొక సమయంలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసిన భారత్... ఆ తర్వాత 181 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు ఇరు జట్ల మధ్య సిరీస్‌ లో చివరిదైన మూడో వన్డే మంగళవారం జరగనుంది. రెండు జట్లు సిరీస్‌ ను కైవసం చేసుకునేందుకు బరిలోకి దిగుతాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు