YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు వివరించారు. పార్టీ సిద్దాంతాలు, భావాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానం పలుకుతామని తెలిపారు.

YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
New Update

కాంగ్రెస్‌  (Congress) పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్ద రాజు (Gidugu raddaraju)  పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సాఆర్‌ కుమార్తె వైఎస్‌ షర్మిల  (YS Sharmila) పార్టీలోకి వస్తే ఆమెను తప్పకుండా ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. ఈరోజు కాకినాడలో ఆయన వంద సంవత్సరాల క్రితం బుచ్చి సాంబ మూర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ సెషన్స్‌ జరిగాయి. దాన్ని పురస్కరించుకొని శుక్రవారం కాకినాడలో సెంటినరీ సెలబ్రేషన్స్‌ (Cetinary Celebrations)  నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గిడుగు రుద్దరాజు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోకి ఎవరు వచ్చిన ఆహ్వానిస్తామని తెలిపారు. గురువారం నాడు ఎయిర్‌ పోర్టులో డీకే శివకుమార్‌, చంద్రబాబు మామూలుగా మాట్లాడుకున్నారే తప్ప రాజకీయాల గురించి కాదని ఆయన వివరించారు.

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల్ని సమయత్తం చేస్తుందని వివరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు రుద్దరాజు తెలిపారు. రానున్న ఎన్నికల కోసం ఏపీలో అభ్యర్థుల్ని ప్రకటించడానికి అధిష్టానం కూడా ముందుందని తెలిపారు.

కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఆయన వెంటనే ప్రత్యేక హోదా కల్పిస్తారని ఈ సందర్భంగా రుద్దరాజు వివరించారు. అలాగే స్టీల్ ప్లాంట్‌ వ్యతిరేకికరణ పై కూడా ఇప్పటికే కాంగ్రెస్‌ ఓ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

త్వరలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ,డీకే శివకుమార్,రేవంత్ రెడ్డి అగ్ర నాయకులందరూ ఏపీలో పర్యటిస్తారని గిడుగు రుద్రరాజు ప్రకటించారు.

Also read: నటి అమలాపాల్‌ మాజీ భర్త పై దాడి..కారు ఆపి మరీ!

#congress #ys-sharmila #ap-elections #gidugu-raddaraju #ap-pcc-president
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe