Andhra Pradesh: వైసీపీ మరో బిగ్ షాక్.. 'గుడ్ బై' చెప్పిన ఎమ్మెల్యే..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సీఎం జగన్‌కు చెప్పేశారు రాంబాబు. వైసీపీ కార్యకర్తగా ఎన్నికల్లో సహకరిస్తానని అన్నారు.

New Update
Andhra Pradesh: వైసీపీ మరో బిగ్ షాక్.. 'గుడ్ బై' చెప్పిన ఎమ్మెల్యే..!

Giddalur YSRCP MLA Anna Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారే యోచన చేస్తుండగా.. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అన్నా రాంబాబు. అయితే, తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని, అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అన్నా రాంబాబు.

ఇదే సమయంలో పార్టీకి ఫేవర్‌గా ఒక కామెంట్ చేశారు. వైసీపీ నుంచి గిద్దలూరు ఎన్నికల బరిలో ఎవరు ఉన్నా.. పార్టీ కార్యకర్తలా పని చేసి గెలిపిస్తానని ప్రకటించారు అన్నా రాంబాబు. తాను పార్టీని వీడనని, వేరే పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు అన్నా రాంబాబు. తన నిర్ణయాన్ని ఇప్పటికే సీఎం జగన్‌కి చెప్పానని తెలిపారు. అయితే, పోటీ చేయాలని కోరారని, కానీ, తాను చేయలేనని చెప్పినట్లు తెలిపారు అన్నా రాంబాబు. తనపై కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు రాంబాబు.

వైసీపీని వీడిని ఎమ్మెల్సీ..

ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వంశీ కృష్ణ. ఈ సందర్భంగా మాట్లాడిన వంశీ.. వైఎస్‌ఆర్‌సీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీలోనే ఉన్నానని అన్నారు. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి ఇప్పుడు ఈ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఇవాళ సొంత కుటుంబంలోకి వచ్చినట్లు తనకు అనిపిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎనలేని అభిమానం అని.. ఇప్పుడు ఆయన పార్టీలో చేరడం తనకు సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో పవన్‌తో కలిసి పార్టీ, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు వంశీ కృష్ణ. కాగా, కొన్ని దుష్టశక్తుల కారణంగా వైసీపీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్న ఆయన.. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Also Read:

రాష్ట్రంలో పెరిగిన నేరాలు.. నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్ బాబు

ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫామ్.. డౌన్లోడ్ చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు