ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న గులాం నబీ ఆజాద్‌!

జమ్ముకశ్మీర్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయన ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయిచుకున్నట్లు తెలుస్తుంది.

ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న గులాం నబీ ఆజాద్‌!
New Update

Elections: జమ్ముకశ్మీర్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయన ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయిచుకున్నట్లు తెలుస్తుంది. అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం ఆయనను ఆ పార్టీ నామినేట్‌ చేసింది. అయితే గులాం నబీ ఆజాద్ అనూహ్యంగా ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బుధవారం ప్రకటించారు. అనంతనాగ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గులాం నబీ ఆజాద్ పోటీలో నిలుస్తున్నట్లు ఈ నెల 2న డీపీఏపీ ప్రకటించింది.

దీంతో ఈ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్‌తో ఆయన తలపడతారని అంతా భావించారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గులాం నబీ ఆజాద్‌ బుధవారం తేల్చి చెప్పారు.

Also read: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!

#elections #jammu-kashmir #azad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe