హైదరాబాద్‎లో దంచికొట్టిన వాన..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం..అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ...!!

హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. సోమవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ...వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‎లో దంచికొట్టిన వాన..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం..అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ...!!
New Update

publive-image

హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. సోమవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ...వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరిగ్గా ఆఫీసుల్లోనుంచి బయటకు వచ్చే సమయంలో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణలో పలు చోట్ల రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం రెండు గంటలపాటు భారీ వర్షం కురిసిందని తెలిపింది. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

ఇక భారీ వర్షం కారణంగా పంజాగుట్ట ఫ్లైఓవర్ పై వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఐకియా పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంజాగుట్ట, బేగంపేట ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు రాకపోకలు నిలిచిపోడంతో గంటలతరబడి రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక కొండాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదిపట్నం, మియాపూర్, నాంపల్లి, బషీర్ బాగ్, ఆబిడ్స్, కోఠి, అంబర్ పట్, ఉప్పల్, నాచారం, తార్నాక, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో...నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. భీకర ఉరుములతో జనాలు భయపడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక ఉద్యోగుల కష్టాలు వర్ణాతీతం. విధులు ముగించుకుని బయటకు వస్తున్న సమయంలోనే భారీ వర్షం కురిసింది. దీంతో ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. 040 21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో DRFబృందాలను రంగంలోకి దింపింది జీహెచ్ఎంసీ.

రానున్న మూడు నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు వాతావరణ రెడ్ అలెర్ట్ ను జారీ చేయడంతోపాటు..రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించింది.

#traffic-jam #hyderabad #heavy-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe