Telangana: తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్‌లోకి ఆ మాజీ మంత్రి! జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ ఓకే అంటే తలసాని కాంగ్రెస్‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. By srinivas 12 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి BRS-CONGRESS: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుకానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా త్వరలో బడా నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని లాబీయింగ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తలసాని చేరిక అంశం రాహుల్‌గాంధీ దగ్గరకు కూడా వెళ్లిందని, రాహుల్ ఓకే అంటే త్వరలోనే తలసాని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదంటూ.. మరోవైపు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రాధాన్యత లేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపట్లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరే వారికి రాజకీయ భవిష్యత్తు, భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైందని, అమెరికా టూర్ ముగించుకుని హైదరాబాద్ నుంచి తిరిగి రాగానే పార్టీ నేతలతో చర్చించి ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టి పెట్టనున్న సమాచారం. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. #congress-operation-akarsh #ghmc-elections #talasani-srinivas-yadav మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి