ప్రతి ఒక్కరూ మందపాటి, నలుపు, పొడవాటి జుట్టును ఇష్టపడతారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు నెరసిపోవడం, రాలడం వల్ల కూడా ముఖం అందం తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో నలుగురిలో తిరగాలంటే ఏదోలా ఫీల్ అవుతుంటారు. మారుతున్న జీవనశైలి కారణంగా మీరు కూడా జుట్టు సమస్యను (White hair problem) ఎదుర్కొంటున్నట్లయితే, మీరు వంటగదిలో ఉండే ఈ వస్తువుల సహాయంతో జుట్టు సమస్యను పరిష్కరించుకోవచ్చు. తెల్ల జుట్టును వదిలించుకోవడానికి (How To Get Rid Of White Hair), మీరు ఇక్కడ పేర్కొన్న చిట్కాలను అనుసరించవచ్చు (White Hair Home Remedies).
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఈ పద్ధతులను పాటించండి:
బ్లాక్ టీ: (Black Tea For White Hair)
బ్లాక్ టీని ఖచ్చితంగా అన్ని ఇళ్లలో వాడుతుంటారు. చాలామంది రోజు టీతో ప్రారంభమవుతుంది. ఇది పానీయంగా మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. తెల్ల వెంట్రుకలతో ఇబ్బంది పడుతుంటే బ్లాక్ టీతో మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. జుట్టు కోసం టీని ఉపయోగించేందుకు, దానిని మరిగించి, ఆపై నీటిని వేరు చేసి చల్లబర్చండి. తర్వాత ఈ నీటిని జుట్టుకు పట్టించి కొంత సమయం తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.
ఉసిరికాయ: (Amla Tea For White Hair)
ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు మాత్రమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఉసిరికాయ జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉసిరికాయను ఉపయోగించడానికి, ఉడకబెట్టండి. మరిగిన తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించాలి. కొంత సమయం తర్వాత మీ తలను కడగాలి.
మెంతి గింజలు (Fenugreek seeds for white hair)
మీరు తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతుంటే..వంటగదిలో మసాలాగా ఉపయోగించే మెంతితో మీ జుట్టును నల్లగా చేసుకోవచ్చు. వెంట్రుకలను నల్లగా మార్చడంతో పాటు, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. దీనిని ఉపయోగించడానికి, కొన్ని మెంతులు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం వాటిని రుబ్బుకోవాలి. తయారుచేసిన పేస్ట్‌ను హెయిర్ మాస్క్ లాగా జుట్టు మీద వేయండి. సుమారు 2 గంటల పాటు జుట్టు మీద ఉంచి, ఆపై జుట్టును కడగాలి. మీరు దీన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మందుబాబులకు షాక్.. 3 రోజులు వైన్స్ బంద్.. ఎందుకంటే?