Chicken Checks Insects: కోడితో క్రిములు పరార్‌.. ఈ చిట్కా మీరు ట్రై చేయండి

క్రిములు, కీటకాలు వస్తున్నాయని, ఎలాంటి రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరంలేదని చెబుతున్నాడు ఓ నెటిజన్. కీటకాలు, పురుగుల నివారణకు ఇంట్లో ఓ కోడిని పెంచుకుంటే చాలంటున్నాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా మన ఇంట్లోనే కీటకాలకు చెక్‌ పెట్టేది కోడి మాత్రమేనని చెప్పాడు.

Chicken Checks Insects: కోడితో క్రిములు పరార్‌.. ఈ చిట్కా మీరు ట్రై చేయండి
New Update

Chicken Checks Insects in house: ప్రతి ఒక్కరూ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుతూ ఉంటారు. సిటీల్లో అయితే కాస్త కస్టమే అని చెప్పాలి. గ్రామాల్లో అయితే ఎక్కువగా పశువులు, కోళ్లను పెంచుతారు. సిటీలో అయితే కోళ్లు బయట కనిపించవు కూడా. కేవలం మాంసం కోసమే షాపునకు వెళ్లి తెచ్చుకొని బ్రాయిలర్‌, ఫామ్‌ కోళ్లను తింటూ ఉంటారు. ఇక పెంచుకోవడానికి ఎవరూ మక్కువ చూపురు. అయితే సాధారణంగా మన ఇళ్లలోకి అనేక రకాల క్రిములు, కీటకాలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల వ్యాధులు కూడా ప్రబలుతుంటాయి. అయితే.. మనం వాడిని నిరోధించడానికి ఎన్నో రసాయనాలు వాడుతూ ఉంటాం, ఖరీదైన స్ప్రేలను కూడా వినియోగిస్తాం. అలా రసాయనాలు వాడటం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఎలాంటి రసాయనాలు వాడకుండా మన ఇంట్లోనే కీటకాలకు చెక్‌ పెట్టవచ్చని కొందరు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: జున్ను తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?

ప్రతి సీజన్‌లో క్రిములు, కీటకాలు మన ఇళ్లలోకి వస్తూనే ఉంటాయి. వర్షాకాలంలో అయితే చెప్పనక్కర్లేదు, విఫరీతంగా క్రిములు ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. ఎన్నో అనారోగ్యాల బారిన మనల్ని పడేస్తుంటాయి. అయితే వీటి బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎంతో ఖరీదైన స్ప్రేమ వాడుతూ ఉంటాం. మరికొందరైతే కాస్త తెలివిగా ఆలోచించి బేకింగ్ సోడా, నిమ్మకాయ స్ప్రేలను ఇళ్లలోనే తయారు చేసుకుని కీటకాలను తరిమికొడుతూ ఉంటారు. అయితే.. ఇంట్లో కోడిని పెంచుకుంటే ఎలాంటి క్రిమి, కీటకాలు ఉండవని కొందరు చెబుతున్నారు. చెప్పడమే కాదు నిరూపించారు కూడా.

ఇంట్లో ఉన్న కీటకాలకు చెక్

ఈ మధ్యకాలంలో ఇంటర్‌నెట్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ ట్విటర్‌ యూజర్‌ రాత్రిపూట క్రిములు, కీటకాలు వస్తున్నాయని, ఎలాంటి రసాయనాలు అవసరంలేదు.. కేవలం సహజమైన చిట్కా ఉందంటూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన ఇంట్లో ఒక కర్ర ఉంచి దానిపై కోడిని నిలిపాడు. అది అక్కడున్న క్రిములు, కీటకాలను ఎంచక్కా ఆరగిస్తోంది. దీంతో ఆ వ్యక్తి క్రిములను ఇలా కూడా తరిమికొట్ట వచ్చంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కోడికి కూడా ఆహారం వేసినట్టు అవుతుందని అంటున్నాడు.

#tips #health-benefits #chicken
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe