పొడి దగ్గు సాధరణమైన సమస్యే కానీ, సాధారణ లైఫ్‌స్టైల్‌ను భాగ దెబ్బతీస్తుంది. పొడిదగ్గు అంత సులభంగా తగ్గదు. ఒక్కోసారి మనం పడుకున్నప్పుడు నిద్రలో దగ్గు వస్తది. ఎన్ని నీళ్లు తాగినా.. దానినుంచి ఉపశమనం రాదు.. చికాకుగా ఉంటుంది. ఎంతసేపటికి తగ్గదు.. మళ్లీ దగ్గు వస్తూనే ఉంటుంది.. దీన్నే పొడిదగ్గు అంటారు. ప్రస్తుతం మారిన వాతావరణ మార్పుల వల్ల ఈ పొడి దగ్గు అనేది పెద్ద సమస్యగా మారింది. ఒక్కోసారి మందులు వేసుకున్న తగ్గదు.. ఆ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. ఈ పొడి దగ్గును తగ్గించుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Home remedies
- ఆయుర్వేదం ప్రకారం: ఆవ పొడిలో అర టీస్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఈ పొడి దగ్గుకు చెక్ పెట్టవచ్చు.
- జీలకర్ర, కలకండను నమిలి తిన్నా పొడి దగ్గు దూరం త్వరగా తగ్గుతుంది.
- మిరియాలు, దాల్చిన చెక్కల్ని, నెయ్యిలో వేసి దోరగా వేయించుకోవాలి. ఆ పొడిని ఓ తమలపాకులో పెట్టి తింటే దగ్గు మాయం.
- శొంఠి పొడిలో చిటికెడు యాలకుల పొడి, తేనె కలిపి తీసుకోన్న పొడి దగ్గు తగ్గుతుంది.
- అల్లంరసం, నిమ్మకాయ రసం, మిరియాల పొడి కలిసి రోజుకు ఉదయం, సాయంత్రం తాగాలి.
- కొద్ది రోజులు ఇలా చేస్తే పొడి దగ్గు నుంచి మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- పొడి దగ్గు ఎక్కువగా ఉంటే చల్లని నీరు, చల్లని ఆహారాలు తినడం మానుకోవాలి
- రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె వెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు.
- లైకోరైస్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కలిపి రాత్రి పడుకునే ముందు తింటే మంచిది
- ఇలా చేస్తే కొన్ని రోజుల్లో గొంతునొప్పి, పొడి దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.
- అంతేకాదు.. ఇవన్నీ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని ఆయుర్వేదం నిపులు అంటున్నారు.
ఇలా తరచుగా పొడి దగ్గు ఉంటే రాత్రి నిద్రపోవడం సాధ్యం కాదు. సాధారణంగా ఈ దగ్గు అత్యంత తీవ్రమైన వ్యాధి. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రను పాడుచేసి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమిడీస్‌తో సులభంగా తగ్గించుకోవచ్చు. దగ్గు, ఛాతీ నొప్పి, గొంతు నొప్పికి మందులు వాడుతున్నా పొడి దగ్గు నుంచి ఉపశమనం ఉండదు. జ్వరం వచ్చినా దగ్గు తగ్గదు. మీకు ఇలానే అనిపిస్తే కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.
ఇది కూడా చదవండి: స్నానానికి చల్ల, వేడి నీళ్లు మంచివా..రోజూ స్నానం చేయకపోతే ఏమవుతుంది..?