Germany: విమానాశ్రయంలో కాల్పులు..నిలిచిన సర్వీసులు!

హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్‌ లో విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు.

Germany: విమానాశ్రయంలో కాల్పులు..నిలిచిన సర్వీసులు!
New Update

జర్మనీ(Germany) లోని హాంబర్గ్‌ (Hamberg) ఎయిర్‌పోర్ట్‌(Airport)  లో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో విమానాలన్నీ నిలిచిపోయాయి. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ ల విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... టెర్మినల్ వన్‌ ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో కనిపించాడు.

అతను విమానాశ్రయ భద్రతా అడ్డంకులను బద్దలు కొట్టుకుని విమానం ఎక్కే ప్రాంతంలోకి వెళ్లాడు. దీంతో అతనిని అడ్డుకునేందుకు కొందరు పోలీసు అధికారులు అతనిని వెంబడిస్తూ ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో దుండగుడితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దుండగుడు చేసిన కాల్పుల వల్ల శనివారం నాడు ఎలాంటి విమాన సర్వీసులు ఉండవని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. దీంతో విమానాలు అన్ని కూడా ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.ప్రస్తుతానికి విమానాశ్రయంలో ఎలాంటి విమాన సర్వీసులు నడపడం లేదని అధికారులు తెలిపారు.

దీని వల్ల సుమారు 27 విమాన సర్వీసులను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి రెండు గాజు సీసాలకు నిప్పు పెట్టి విమానాశ్రయంలోనికి విసిరినట్లు పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయంలోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.

Also read: కేజీ ఉల్లిపాయ రూ. 25 లే..ఎక్కడంటే!

#gun #germany #airport #hamburg #shot
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి