TS Lok Sabha Elections : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?

ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 9మంది అభ్యర్థులతో ఫస్ట్‌ లిస్ట్‌ను ఇవాళ రిలీజ్‌ చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది. లిస్ట్‌లో ఎవరుండే ఛాన్స్ ఉంది? దీని గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
TS Lok Sabha Elections : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?

Congress First List In Telangana : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ కాంగ్రెస్‌(Congress) దూకుడు పెంచింది. ఏ క్షణంలోనైనా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో జరుగుతున్న సీఈసీ సమావేశానికి కాంగ్రెస్‌ అధినేత్రి మల్లికార్జున్‌ ఖర్గే(Mallikarjun Kharge), మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్‌ నేతలంతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నప్పటికీ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ 'భారత్‌ జోడో న్యాయ యాత్ర'(Bharat Jodo Nyay Yatra) లో బిజీబిజీగా ఉండటం వల్ల హాజరు కాలేదు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో గాంధీ కుటుంబీకుల సీట్లపై స‌స్పెన్స్ కొన‌సాగుతుండ‌డం విశేషం. ఇటు తెలంగాణలో ఎవరికి సీట్లు దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయినట్టుగా తెలుస్తోంది. 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఫైనల్‌ చేసినట్టుగా సమాచారం. 9మంది అభ్యర్థులతో ఫస్ట్‌ లిస్ట్‌ను ఇవాళ రిలీజ్‌ చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది.

లిస్ట్‌లో ఎవరుండే ఛాన్స్ ఉంది?
----> మహబూబ్‌నగర్‌ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి..
----> చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి..
----> సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌..
----> జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌..
----> నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి..
----> పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ..
----> మల్కాజ్‌గిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి..
----> మెదక్‌ నుంచి నీలం మధు..
----> నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని అభ్యర్థులుగా నిర్ణయించినట్లు సమాచారం.
----> ఖమ్మం, భువనగిరి, నాగర్‌కర్నూల్‌ పెండింగ్‌

అటు ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సతీమణి నందిని టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తన తమ్ముడు ప్రసాద్‌రెడ్డికి ఖమ్మం టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తన కుమారుడు యుగంధర్‌కు టికెట్‌ అడుగుతున్నారు. ఇక నాగర్‌ కర్నూల్‌ సీటుకు డిప్యూటీ సీఎం సోదరుడు మల్లు రవి పోటీ పడుతున్నారు. టికెట్‌ కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. రెండు రోజుల కిందట పార్టీ చీఫ్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి టికెట్‌ కోసం విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో కూడా ఆయన భేటీ అయి టికెట్‌పై చర్చించారు. గత ఎన్నికలలో అలంపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌.. మాదిగ కోటాలో నాగర్‌కర్నూల్‌(Nagarkurnool) సీటు తనకు కేటాయించాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read : బీజేపీలోకి స్టార్‌ క్రికెటర్ షమీ.. ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటి?

Advertisment
తాజా కథనాలు