General Elections 2024: లోక్‌సభ ఐదో దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ 

లోక్ సభ ఎన్నికల పర్వం ఐదో దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఐదో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరుగుతుంది. రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు ఈ దశలో పోటీ పడుతున్నారు.

General Elections 2024: ఐదో దశ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేస్తున్న స్థానంతో సహా పది కీలక నియోజకవర్గాలివే 
New Update

General Elections 2024: ఇప్పటికే 2024 లోక్‌సభ ఎన్నికలకు నాలుగు దశల్లో ఓటింగ్ పూర్తయింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మే 20న ఐదో దశ పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాలలో  శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. ఈ దశలో సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఐదో దశలో ఉత్తరప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూ-కశ్మీర్, లడఖ్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది.

General Elections 2024: ఐదో దశ ఓటింగ్‌లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఐదవ దశలో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ, అమేథీ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కైసర్‌గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, ఆర్జేడీ నాయకుడు, పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమార్తె బీహార్ రోహిణి ఆచార్య సరన్ నుండి, చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ నుండి, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ముంబై నార్త్ నుండి, నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బారాముల్లా నుండి పోటీ చేస్తున్నారు.

Also Read: ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం..

General Elections 2024: గత నాలుగు దశల్లో దాదాపు 60 నుంచి 69 శాతం ఓటింగ్ జరిగింది.  మే 13న 96 నియోజకవర్గాల్లో జరిగిన నాలుగో దశ పోలింగ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 69.16 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎన్నికల సంఘం ప్రకారం, ఈ దశలో 69.58 శాతం పురుష ఓటర్లు, 68.73 శాతం మహిళా ఓటర్లు, 34.23 శాతం థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

General Elections 2024: రాష్ట్రాల వారీగా ఐదో దశ పోలింగ్ జరగనున్న సీట్లు ఇవే.. 

మహారాష్ట్ర: ముంబై నార్త్, ముంబై నార్త్-వెస్ట్, ముంబై నార్త్-ఈస్ట్, ముంబై నార్త్-సెంట్రల్, ముంబై సౌత్-సెంట్రల్, ముంబై సౌత్, థానే, కళ్యాణ్, పాల్ఘర్, ధులే, డిండోరి, నాసిక్, భివాండి.

ఉత్తరప్రదేశ్: లక్నో, అమేథీ, రాయ్ బరేలీ, మోహన్‌లాల్‌గంజ్, జలౌన్, ఝాన్సీ, హమీర్‌పూర్, బందా, కౌశంబి, ఫతేపూర్, గోండా, బారాబంకి, ఫైజాబాద్, కైసర్‌గంజ్.

పశ్చిమ బెంగాల్: హౌరా, హుగ్లీ, ఆరంబాగ్, బొంగావ్, బరాక్‌పూర్, శ్రీరాంపూర్, ఉలుబేరియా

బీహార్: ముజఫర్‌పూర్, మధుబని, హాజీపూర్, సీతామర్హి, సరన్

జార్ఖండ్: చత్రా, కోడెర్మా, హజారీబాగ్

ఒడిశా: బర్గర్, సుందర్‌ఘర్, బోలంగీర్, కంధమాల్, అస్కా

జమ్మూ కాశ్మీర్: బారాముల్లా

లడఖ్: లడఖ్

#2024-lok-sabha-elections #general-elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe