Gambhir: ఇండియాలో అతన్ని మించిన నాయకుడు లేడు.. గంభీర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ క్రికెట్‌లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అన్నాడు. ఇప్పటివరకూ అలాంటి నాయకుడు లేడని, 3ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమ్‌ ఇండియా కెప్టెన్ ఘనత అతనికే దక్కిందంటూ పొగిడేశాడు.

New Update
Gambhir: ఇండియాలో అతన్ని మించిన నాయకుడు లేడు.. గంభీర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Gautam Gambhir on MS Dhoni: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ క్రికెట్‌లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో సందేహమే లేదన్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అలాంటి నాయకుడు లేడని, మూడు ఐసీసీ ట్రోఫీలను (ICC Trophy) నెగ్గిన ఏకైక టీమ్‌ఇండియా కెప్టెన్ ఘనత అతనికే దక్కిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అలాంటి సారథి లేడు..
ఈ మేరకు చెపాక్ వేదికగా కోల్‌కతా - చెన్నై (CSK Vs KKR) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో కోల్‌కతా మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ మ్యాచ్ గురించి మాట్లాడిన వీడియోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ‘నేను ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరుకుంటా. స్నేహితులైనా సరే పరస్పరం గౌరవించుకోవాలి. నేను కోల్‌కతా సారథిగా ఉన్నప్పుడు. ధోనీ సీఎస్‌కే కెప్టెన్. ప్రత్యర్థులుగా బరిలోకి దిగినప్పుడు గెలుపు కోసమే కష్టపడతాం. ఇదే ప్రశ్న ధోనీని అడిగినా అతడు ఇదే చెబుతాడు. భారత క్రికెట్‌లో ధోనీ (MS Dhoni) అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో సందేహమే లేదు. ఇప్పటివరకు అలాంటి సారథి లేడు. మూడు ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమ్‌ఇండియా కెప్టెన్ అతనే అంటూ పొగిడేశాడు.

ఇది కూడా చదవండి: CM Revanth: సీఎం రేవంత్ కు తృటిలో తప్పిన ప్రమాదం!

ఎప్పుడూ సవాలే..
అలాగే ఐపీఎల్‌లో ధోనీకి ప్రత్యర్థిగా బ్యాటింగ్‌ చేయడం ఎప్పుడూ సవాల్‌ గానే ఉంటుంది. వ్యూహాలకు పదునుపెట్టే మైండ్‌సెట్‌ అద్భుతం. ఒక్కో బ్యాటర్‌కు ఎలా ఫీల్డింగ్‌ ను సెట్‌ చేయాలనేది అతడికి బాగా తెలుసు. చివరి బంతి వరకూ మ్యాచ్‌ను చేజారనివ్వడు. అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే మ్యాచ్‌ను ముగిస్తాడు. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైనా భయపడదు. చెన్నై బ్యాటర్లకు బౌలింగ్‌ చేయడమంటే కఠిన సవాలే. అయినా సరే విజయం సాధించేవరకూ పోరాడతామంటూ చెప్పుకొచ్చాడు గంభీర్.

Advertisment
తాజా కథనాలు