Gas Geyser: గ్యాస్‌ గీజర్‌ లోని వాయువు పీల్చే ముగ్గురు మృతి!

హైదరాబాద్‌ సనత్‌ నగర్‌ లోని జెక్‌ కాలనీలో ఆదివారం బాత్‌ రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడానికి గ్యాస్‌ గీజర్‌ లోని కార్బన్‌ మోనాక్సైడే అని వైద్యుల నిర్థరాణలో తేలింది.మానసిక స్థితి సరిగాలేని కుమారుడుకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Gas Geyser : మీరు గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి!

Gas Geyser: హైదరాబాద్‌ సనత్‌ నగర్‌ లోని జెక్‌ కాలనీలో ఆదివారం బాత్‌ రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడానికి గ్యాస్‌ గీజర్‌ లోని కార్బన్‌ మోనాక్సైడే అని వైద్యుల నిర్థరాణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిగ్నోడ్‌ ట్రాన్సిస్ట్‌ ప్యాకింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలో బిజినెస్‌ హెడ్‌ గా పని చేసే వెంకటేష్‌ (59), ఆయన భార్య మాధవి (52) , కుమారుడు హరికృష్ణ (25)..జెక్‌ కాలనీలో ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌ మెంట్‌లోని తమ ఫ్లాట్‌ బాత్రూంలో ఆదివారం ఉదయం మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

మానసిక స్థితి సరిగాలేని కుమారుడు హరికృష్ణకు తల్లిదండ్రులు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 8.30 గంటలకు కూడా పక్క ఫ్లాట్‌ వారికి వీరు ముగ్గురు కనిపించి వీడ్కోలు చెప్పారు.

తర్వాత కొద్దిసేపటికే..బాత్ రూంలోనికి వెళ్లిన సమయంలో గీజర్‌ నుంచి విడుదలైన కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడంతో ఆ ముగ్గురూ స్పృహతప్పి క్షణాల వ్యవధిలోనే ముగ్గురు మరణించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక అందిన తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు వివరించారు.

Also read: నడిరోడ్డు పై మహిళ వింతపూజలు!


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు