కార్తీక మాసం ముందు నుంచే టమాటా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటి బాటలోకి వెల్లుల్లి వంతు వచ్చి చేరినట్లు అనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజుల్లోనే వెల్లుల్లి ధరలు రెండింతలు అయ్యాయి. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో వెల్లుల్లి కేజీ రూ. 400 పలుకుతోంది.
కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ. 300 నుంచి 400 మధ్య ఉంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో పంట ధ్వంసమవ్వడంతో పాటు మార్కెట్ లో డిమాండ్ కు తగ్గ సప్లయి లేకపోవడమే వెల్లుల్లి ధరలకు రెక్కలు రావడానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే హోల్ సేల్ మార్కెట్లో కేజీ వెల్లుల్లి ధర రూ. 130 నుంచి 140 గా ఉండగా..హై క్వాలిటీ వెల్లుల్లి మాత్రం కేజీ కి రూ. 220 నుంచి రూ. 250 మధ్యలో ఉంది.
ప్రతి సంవత్సరం శీతాకాలంలో వెల్లుల్లి ధరలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం పంట నష్టంతో మరింత ఆందోళనకరంగా మారాయి. ఇప్పట్లో పంట చేతికి వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడప్పుడే ధరలు తగ్గే సూచనలు లేవని తెలుస్తోంది.
"స్టాక్ పడిపోతోంది. సప్లై రావడం లేదు. వర్షాకాలంలో వానలు సరిగ్గా పడకపోవడంతో పంట సరిగ్గా పండలేదు. ఇప్పుడు పంట పండినా.. అకాల వర్షాలకు ధ్వంసమైపోయింది. ఇప్పట్లో ధరలు తగ్గకపోవచ్చు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి రావాల్సిన సరకు.. చాలా ఎక్కువ ధర పలుకుతోంది," అని ముంబై ఏపీఎంసీ డైరక్టర్ అశోక్ తెలిపారు.
Also read: సూపర్ స్టార్‌కి మాజీ అల్లుడి పుట్టిన రోజు శుభాకాంక్షలు!