Garika: గరిక భారతదేశంలోని గణేశ పూజలో పవిత్రమైనదిగా చెబుతారు. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు.. ఇది ఆయుర్వేదంలో కూడా ముఖ్యమైన మూలిక. గరికలో విటమిన్-ఎ, విటమిన్-సి, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఎసిటిక్ యాసిడ్, ఆల్కలాయిడ్స్, గ్లూకోసైడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ గుణాలు అనేక వ్యాధులను నివారిస్తుంది. దాని ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి అధికం:
గరికలో విటమిన్-ఎ, విటమిన్-సి, ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దీన్ని రోజూ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధులను నివారించవచ్చు.
వాపుకు చెక్:
గరికలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తుంది. శరీరంలో ఏదైనా రకమైన వాపు ఉంటే.. అప్పుడు గడ్డి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది:
గరికలో యాంటీ-వైరల్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఈ లక్షణాలు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడేలా చేస్తాయి.
చర్మ సంరక్షణ:
గరికలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ గడ్డి చర్మ సమస్యలను తొలగించి.. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. రోజువారీ ఉపయోగంతో చర్మపు చికాకు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
జీర్ణశక్తి ఎక్కువ:
జీర్ణ సమస్యల నివారణకు గరిక బాగా ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో దీని రసాన్ని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఇది పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. దీన్ని రోజూ తాగడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడతాయి, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. గరికలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఒత్తిడి పరార్:
మానసిక ఒత్తిడిని తగ్గించడంలో గరిక తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన అంశాలు, యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గరికని రోజూ తినడం వల్ల మెదడులోని నరాలు ప్రశాంతంగా ఉంటాయి. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మీ బిడ్డ చాలా సన్నగా ఉందా? సరైన బరువు ఎంత ఉండాలో తెలుసుకోండి!