UNESCO Declares Gujarat's Garba As Intangible Cultural : గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బా (Garba)కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఙానిక, సాంస్కృతిక సంస్థ (UNESCO) గర్బాను డిసెంబర్ 6న తన జాబితాలో చేర్చుకుంది. దీంతో గుజరాత్ నుంచి ఈ నృత్యం ఎంపిక కావడంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇది గుజరాత్ ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. ఇప్పటికే భారత్ నుంచి పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతా దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించింది. ఇప్పుడు తాజాగా గర్బా నృత్యానికి ఈ గుర్తింపు లభించింది. గర్బాకు లభించిన ఈ అరుదైన గుర్తింపు పై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చూపించేందుకు ఇది గొప్ప అవకాశమని..మన వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం ఈ గౌరవం స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. గర్బా అనేది జీవితం, ఐక్యత మరియు మన లోతైన సంప్రదాయాల వేడుక అని పేర్కొన్నారు.
Also read: తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్!
'' అమ్మవారి ఎదుట భక్తిని చాటే ఈ గర్బా నృత్యం ఒక పురాతన సంప్రదాయం. ఇది సజీవంగా వర్దిల్లుతోంది. గుజరాత్ కు గుర్తింపుగా నిలిచిన గర్బాను యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చింది. ఈ గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు గర్వకారణమని'' ముఖ్యమంత్రి పేర్కొన్నారు.