Ganesh Nimajjanam: హిందువులు ప్రతి పండగల్లో ఎంతో భక్తితో దేవుళ్లని పూజిస్తారు. అయితే ప్రతి పూజల్లో దేవుళ్లకి పూజా చేసి కొన్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటారు. కొందరి దేవుళ్లను నిమజ్జనం చేయరు. కానీ వినాయక చవితి మాత్రం గణపతికి ఘనంగా 9 రోజులు పూజలు నిర్వహించి నీళ్లలో నిమజ్జనం చేస్తాం. ఇలా ఎందుకు చేస్తారు చాలామందికి తెలియదు. కేవలం గణపతిని మాత్రమే నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
జల నిమజ్జనం చేయటానికి కారణం:
పదిరోజులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య విగ్రహాన్ని మేళతాలతో జల నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడంలో వేదాంత రహస్యం ఉందట. పండితులు చెప్పిన దాని ప్రకారం.. వినాయక చవితికి భక్తుల పూజలు అందుకున్న గణేషుడు వారి కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వస్తాడట. గణపతిని తిరిగి స్వర్గానికి పంపించడానికి సముద్రం దగ్గరి మార్గం. అందువలన గణపతి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారట. అంతేకాదు వర్షాకాలం వనలతో నదులు, చెరువులూ నిండుతాయి. మట్టి విగ్రహా నీటిలో నిమజ్జనం చెస్తే నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.