India Cricket: భారత జట్టుకు పలు సూచనలు చేసిన గంభీర్

ఆసియా కప్‌ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ జట్టు ఇప్పుడు కంగారు టీమ్‌తో వన్డే సిరీస్‌ ఆడేందుకు రెడీ అయింది. కాగా టీమ్‌ ఇండియాపై భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో నెల రోజుల్లో భారత జట్టు వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొనబోతోందన్నాడు.

New Update
India Cricket: భారత జట్టుకు పలు సూచనలు చేసిన గంభీర్

ఆసియా కప్‌ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ జట్టు ఇప్పుడు కంగారు టీమ్‌తో వన్డే సిరీస్‌ ఆడేందుకు రెడీ అయింది. కాగా టీమ్‌ ఇండియాపై భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో నెల రోజుల్లో భారత జట్టు వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొనబోతోందన్నాడు. అప్పటిలోగా టీమ్‌ ఇండియా తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని సూచించాడు. ప్రస్తుతం భారత టీమ్‌లో లోయర్‌ ఆర్డర్‌ మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా, హార్డిక్ పాండ్యా వరల్డ్ కప్‌ టోర్నీలో కీలకంగా మారే అవకాశం ఉందన్నాడు.

బ్యాటింగ్‌ ప్రారంభంలో భారత ఓపెనర్లు పునాధులు వేస్తే చివరి పవర్‌ ప్లేలో ఆల్‌ రౌండర్‌లు భారత బ్యాటింగ్‌లో కీలకంగా మారుతారని, అందుకు తగ్గట్లుగా ఆల్‌ రౌండర్లు సిద్థం కావాలని గంభీర్‌ సూచించాడు. చివరి 10 ఓవర్లలో బ్యాటింగ్‌ చేసే వారు 100 పరుగులు టార్గెట్‌గా పెట్టుకొని రన్స్ సాధించాల్సి ఉంటుందని తెలిపాడు. మరోవైపు భారత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఈ ముగ్గురు బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశమన్నాడు. కానీ వన్డే వరల్డ్‌ కప్‌లో మేడి బౌలర్లతో తలపడటం అంటే మామూలు విషయం కాదన్నాడు.

టోర్నీ స్వదేశంలో జరుగుతున్నా భారత బ్యాటర్లు మాత్రం ఆసిస్‌, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ టీమ్‌లకు చెందిన పేసర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. వారి బౌలింగ్‌ స్పీడ్‌ 140 కి.మీ పైగానే ఉండనుందని దానికి తగ్గట్లుగా పూర్తిగా సిద్ధం కావాలని వెల్లడించాడు. మరోవైపు భారత బౌలింగ్‌ విభాగంలో బుమ్రా టీమిండియాకు కీలకంగా మారనున్నాడని గంభీర్ తెలిపాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బుమ్రా గాయాల బారిన పడకుండా చూసుకోవాలని వివరించాడు. కాగా టీమిండియా ఈ నెల 22 నుంచి ఆసిస్‌తో వన్డే సిరీస్‌ ఆడనుంది. బీసీసీఐ ఈ సిరీస్‌కు సీనియర్లను ఎంపిక చేయలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు