Cricket: Cricket: టీమ్ ఇండియా కోచ్‌గా గంభీర్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గంభీర్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. గంభీర్ డిమాండ్లను బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఈ టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని గంభీర్ భర్తీ చేస్తారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Cricket: Cricket: టీమ్ ఇండియా కోచ్‌గా గంభీర్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!
New Update

Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవికి మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ టీ20 ప్రపంచకప్‌ తర్వాత పదవినుంచి రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకోగానే జులై 1న గంభీర్ పగ్గాలు చేతబట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు ‘టీమ్ ఇండియా కోచ్‌గా ఉండటానికి గంభీర్‌తో చర్చలు జరిపాం. అతను టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తారు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు వార్తలొస్తున్నాయి.

అంతేకాదు తాను కోచ్ గా ఉండాలంటే.. సపోర్టింగ్ స్టాఫ్‌ సెలక్షన్ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని గంభీర్ డిమాండ్ చేశాడట. దీనికి కూడా బీసీసీఐ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ‘భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని అనుకుంటున్నా. జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. 140 మంది కోట్ల భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లెక్క’ అని గంభీర్ ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు.

#gautam-gambhir #bcci #team-india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe