Gabbar Singh 4k: అరే.. ఓ.. గబ్బర్ సింగ్ కో ఫౌజియో.. పీచెమూడ్.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత నేడు పవర్ స్టార్ పుట్టిన రోజు (Pawan Kalyan Birthday) సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ అయ్యింది. దీంతో థియేటర్స్ లో పవన్ మేనియా మామూలుగా లేదు. ఫ్యాన్స్ తెర పై మరోసారి వింటేజ్ పవన్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఏళ్ళు గడిచిన పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా పెరుగుతూనే ఉంది. ఖుషీ తర్వాత మళ్ళీ దాదాపు పదేళ్ల తర్వాత పవన్ స్థాయికి తగ్గ హిట్ గబ్బర్ సింగ్ తో పడింది. 2012 లో ఈ సినిమా విడుదలైనప్పుడు పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సినిమాలో పవన్ డైలాగ్స్, మ్యానరిజమ్, యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు పిచ్చెకించాయి.ఇక 12 ఏళ్ళ తర్వాత కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈరోజు రీ రిలీజైన ఈ మూవీని పవన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని అంత్యాక్షరీ సీన్ లో పాటలకు స్టెప్పులేస్తూ థియేటర్స్ లో రచ్చ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Gabbar Singh 4k: ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ ట్రెండ్.. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ
నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ చేశారు. దీంతో థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. తెర పై మరోసారి వింటేజ్ పవన్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తున్నారు.
Translate this News: