World Bank: భారత్ డిజిటల్ వ్యవస్థ అద్భుతం.. ప్రపంచ బ్యాంక్ కితాబు

ప్రపంచ బ్యాంక్ భారత్‌ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెచ్చుకుంది. ఈ మేరకు జీ20 గ్లోబల్ పార్టనర్‌షిప్‌ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజిన్(GPFI) పేరిట ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) ద్వారా 47 ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం ఆరు సంవత్సరాలనో సాధించారని కొనియాడింది.

UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే...
New Update

World Bank: ప్రపంచ బ్యాంక్ భారత్‌ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెచ్చుకుంది. ఈ మేరకు జీ20 గ్లోబల్ పార్టనర్‌షిప్‌ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజిన్(GPFI) పేరిట ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) ద్వారా 47 ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం ఆరు సంవత్సరాలనో సాధించారని కొనియాడింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జరిగిన యూపీఐ లావాదేవీల విలువ దేశ జీడీపీలో 50శాతం మేర ఉన్నట్టు స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలకు భారత ప్రజలు చాతా వేగంగా అలవాటు పడ్డారని ప్రపంచ బ్యాంక్ చెప్పింది.

ఈ క్రమంలో బ్యాంక్‌లు కూడా కస్టమర్స్ కోసంపెట్టే ఖర్చు కూడా 23 డాలర్ల నుంచి 0.1 డాలర్లకు పడిపోయిందని వెల్లడించింది. దీని వల్ల 2022 మార్చి నాటికి 33 బిలియన్ డాలర్లను భారత్ ఆదా చేసుకోగలిగిందని తెలిపింది. ఇది GDPలో 1.14%తో సమానమని.. ఇదంతా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(DBT) ద్వారానే సాధ్యమైందని పేర్కొంది. భారత ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ డాక్యుమెంట్‌ని రూపొందించింది.

ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేస్తూ 47ఏళ్లలో సాధించాల్సింది.. కేవలం ఆరేళ్లలోనే భారత్ సాధించిందనట్లు ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించిందని ట్వీట్ చేశారు. "కేవలం ఆరేళ్లలో 80శాతం మేర డిజిటల్ లావాదేవీలు జరిగే స్థాయికి భారత్ చేరుకుంది. ఈ ఘనత సాధించాలంటే కనీసం ఐదు దశాబ్దాలు పడుతుంది. కానీ ఇండియా మాత్రం ఆరేళ్లలోనే సాధించింది. ఇదంతా DPI వల్లే. ఆధార్, జన్‌ధన్ బ్యాంక్‌తో పాటు మొబైల్స్ కూడా ఈ ఘనత సాధించడంలో ఎంతో తోడ్పడ్డాయి" అని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.

2015 మార్చిలో ప్రారంభమైన ప్రధానమంత్రి జనధన్ యోజన్ ఖాతాల సంఖ్య 2022 నాటికి 46.2కోట్లకు చేరుకుంది. అలాగే బ్యాంకు ఖాతాల కోసం ఆధార్ కార్డు తప్పనిసరి చేయడమే ఇందుకు దోహదపడింది. డిజిటల్ లావాదేవీల విషయంలో భారతదేశం సాధించిన విజయాల గురించి G20 సదస్సుల వేదికగా తెలియజేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. సదస్సు సందర్భంగా ప్రతినిధులందరికీ UPI ద్వారా రూ.1000 పంపాలని యోచిస్తోందట. సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ డబ్బును అతిథులు వాడుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారట.

ఇది కూడా చదవండి: G-20 లోగోలో కమలం గుర్తు ఉండటంపై ప్రతిపక్షాలు ఫైర్

#digital-public-infrastructure #upi-voice-transaction-feature #g20-summit-2023 #world-bank
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe