Chennai : తల్లిపాలను విక్రయిస్తున్న స్టోర్ సీజ్ చేసిన అధికారులు.. కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకి హానికరమని తెలుసా?

చట్ట విరుద్ధంగా తల్లిపాలను విక్రయిస్తున్న చెన్నైలోని ఓ స్టోర్ పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు దాడులు నిర్వహించారు. పాల బాటిళ్లను సీజ్ చేశారు. మరోవైపు కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శిశువుకు అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.

Chennai : తల్లిపాలను విక్రయిస్తున్న స్టోర్ సీజ్ చేసిన అధికారులు.. కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకి హానికరమని తెలుసా?
New Update

FSSAI seized the store selling breast milk : తల్లిపాలు శిశువుకి ఎంతో బలవర్ధకమైనవి. వీటిలో ఉండే ప్రొటీన్లు శిశువులో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. బిడ్డకు తల్లిపాలు అందించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకు పట్టించడం వల్ల హాని కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ లో తల్లిపాలు విక్రయించడం నిషేధమని తెలిసినా కొన్ని స్టోర్లు అడ్డకోలుగా వీటిని విక్రయిస్తూనే ఉన్నాయి. తాజాగా చెన్నైలో ఓ స్టోర్ ను సీజ్ చేశారు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు. పాల బాటిళ్లను పరీక్షలకు పంపారు.

చెన్నైలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు తల్లిపాలను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న ఔట్‌లెట్‌పై దాడులు నిర్వహించారు. కొందరి పిర్యాదు మేరకు స్టోర్ పై నిఘా పెట్టిన అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్టోర్ లో ఎటువంటి విక్రయాలు జరగకపోయినా తల్లిపాలను దాచిన స్టాక్ బయటపడింది. 50ml బాటిల్ ధర రూ.500 కాగా ప్రస్తుతం ఆ బాటిళ్లను పరీక్షల కోసం పంపారు. తల్లిపాలను విక్రయించడం భారతదేశంలో నిషేధం. అలా చేస్తే FSS చట్టం 2006 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. మరోవైపు కొనుగోలు చేసిన తల్లిపాలు బిడ్డకు తాగించడం వల్ల శిశువుకు హానికరం అంటున్నారు నిపుణులు.

కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకు తాగించడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. HIV, హెపటైటిస్ వంటి వాటితో పాటు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. పాలు సరిగ్గా పరీక్షించకపోయినా, పాశ్చరైజ్ చేయకపోయినా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కొనుగోలు చేసిన తల్లిపాలు పరిశుభ్రంగా ఉండకపోయినా.. భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా బిడ్డకు హాని కలిగించవచ్చును. తల్లిపాలను సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోతే హానికరమైన బాక్టీరియా ప్రబలుతుంది. తల్లిపాలను నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. లేదంటే బాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇక ఈ పాల భద్రత, నాణ్యత, స్వచ్ఛతపై ఆరోగ్య అధికారుల నుండి ఎలాంటి హామీ కూడా ఉండదు. అందుకే వీటిని చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేసి శిశువు హాని కలిగించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#selling-breast-milk #infections #breast-milk #fssai
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe