Health Tips: పొట్ట కరగాలంటే ఈ పండ్లు తినాల్సిందే!

పొట్ట పెరిగితే అనారోగ్యాల ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. పొట్టను తగ్గించుకొని తిరిగి నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే.. బొప్పాయ,యాపిల్,నల్లద్రాక్ష,నిమ్మరసం లాంటివి తీసుకోవాలని వారు అంటున్నారు.అయితే వీటితో కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

New Update
Health Tips: పొట్ట కరగాలంటే ఈ పండ్లు తినాల్సిందే!

Fruits To Lose Belly Fat: ఈ రోజుల్లో మనం తినే ఆహారాల్లో చాలా వరకూ మైదాతో చేస్తున్నవే ఎక్కువ. దానికి తోడు ఫ్రైలు, రెడీ టూ ఈట్, స్నాక్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మన బాడీలో క్రమంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అది అంత తేలిగ్గా కరగదు. దాంతో.. పొట్ట రావడం మొదలవుతుంది. పొట్టలోని కండరాలకు కొవ్వు అతుక్కుపోయి.. పెద్ద పొట్ట వస్తుంది. దాంతో.. పనులు చేయడంలో నెమ్మదిస్తాం. అందువల్ల శారీరక శ్రమ తగ్గి.. మరింత బరువు పెరుగుతాం.

ఆహారం తగ్గించుకున్నంత మాత్రాన పని పూర్తవదు. కొవ్వును కరిగించే ఆహారం తప్పక తీసుకోవాలి. మనందరికీ పండ్లు నచ్చుతాయి. ఆ పండ్లలో కొన్ని కొవ్వును కరిగిస్తాయి. వీలు చూసుకొని.. రోజూ వాటిని తింటూ ఉండాలి. రోజుకో రకం పండ్లను తినాలి. మరీ ఎక్కువ కాకుండా… కొద్ది మొత్తంలో తినాలి. ఆ పండ్లేవో తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బొప్పాయి పండుని (Papaya) తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గి, సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండు ముక్కలపై కాసింత మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఒక 2, 3 నెలలు బొప్పాయిపండుని రోజూ కొద్దికొద్దిగా తిని చూడండి.. తేడా మీకే తెలుస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: పిల్లలలో పోషకాహారలోపానికి గురయ్యే 5 సంకేతాలు!

యాపిల్ (Apple) 2 రకాలుగా బరువు తగ్గిస్తుంది. 1.ఇది ఆకలిని వెయ్యనివ్వదు. అందువల్ల యాపిల్ తిన్నాక మరేదీ తినబుద్ధి కాదు. అందువల్ల స్నాక్స్ జోలికి వెళ్లం. 2. యాపిల్ రోజూ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతారు. దాక్ష (Black Grapes) బరువును బాగా తగ్గిస్తాయి. గ్రీన్ ద్రాక్ష కంటే.. నల్ల ద్రాక్ష అయితే ఎక్కువగా బరువు తగ్గించగలదు. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. శరీరంలో చెడు వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. వీటిలోని పొటాషియం కారణంగా.. త్వరగా బరువు తగ్గుతారు.

కొవ్వును ఐస్‌క్రీమ్‌లా కరిగించే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. ఐతే.. నిమ్మరసంలో (Lemon Water) పంచదార వేసుకుంటే మాత్రం బరువు పెరుగుతారు. అందువల్ల నీటిలో నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, అల్లం రసం కలుపుకొని తాగవచ్చు. రోజుకో నిమ్మకాయ చొప్పున 6 నెలలు వాడితే.. బాడీలో కొవ్వు మొత్తం మాయమవుతుంది.

Advertisment
తాజా కథనాలు