Venkaiah Naidu – Padma Vibhushan Award Winner: ఏ రంగంలోనైనా అందులోనూ రాణించాలంటే.. విశ్వసనీయత చాలా ముఖ్యం. తన గౌరవాన్ని కాపాడుకుంటూనే.. తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అవసరం. అణకువగా ఉంటూనే, అవసరమైన చోట దూకుడు చూపించగలగాలి. అంతకు మించి నడవడికలో ఎప్పుడూ చిన్న తప్పిదం కూడా కనిపించకుండా చూసుకోవాలి. ఇన్ని లక్షణాలు.. ఉండే రాజకీయనాయకులు మన దేశంలో చాలా అరుదు. అందులోనూ సమకాలీన రాజకీయాల్లో.. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగితే ఎక్కువ శాతం మంది కచ్చితంగా చెప్పే పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu). అచ్చ తెలుగు నడవడిక.. స్వచ్ఛమైన చిరునవ్వు.. సంప్రదాయపు పంచె కట్టు.. చూడగానే ఎవరినైనా కట్టిపడేసే రూపం.. మాటల్లో తేట తెలుగు తీయదనం.. స్పష్టమైన వాచికం.. గంభీరమైన కంఠ స్వరం.. వీటికి తోడుగా విశ్వసనీయతకు.. నిజాయతీకి నిలువుటద్దం వెంకయ్యనాయుడు.
పూర్తిగా చదవండి..Venkaiah Naidu: ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉంటూ.. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితాన్ని గడిపి.. ఎమ్మెల్యే నుంచి భారత ఉప రాష్ట్రపతి దాకా ఎన్నో పదవుల్లో తనదైన శైలిలో రాణించిన తెలుగు నేత.. ముప్పవరపు వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం తెలుగుజాతి గర్వకారణం.
Translate this News: