Dengue New born Baby: కడుపులో బిడ్డకు డెంగ్యూ..కోల్‌కతాలో అరుదైన ఘటన!

కోల్‌కతాలో (Kolkata) ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గర్భవతి(Pregnent) గా ఉన్న ఓ మహిళకు డెంగ్యూ(Dengue) రావడంతో కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎన్ఎస్‌1 పాజిటివ్ గా తేలింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ రావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.

New Update
Dengue New born Baby: కడుపులో బిడ్డకు డెంగ్యూ..కోల్‌కతాలో అరుదైన ఘటన!

కోల్‌కతాలో (Kolkata) ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గర్భవతి(Pregnent) గా ఉన్న ఓ మహిళకు డెంగ్యూ(Dengue) రావడంతో కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎన్ఎస్‌1 పాజిటివ్ గా తేలింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ రావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. దీనిని వర్టికల్‌ ట్రాన్స్ మిషన్‌ అని పిలుస్తారు.

అంటే తల్లి బిడ్డకు పాలు పట్టడం ద్వారా వైరస్‌, ఇన్‌ఫెక్షన్‌ అనే సోకడం చాలా సాధారణమైన విషయాలు. ఇవి దోమలు లాంటి జీవుల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ మనుషుల్లో మాత్రం చాలా రేర్‌ కేసేస్ లో మాత్రమే ఇలా జరుగుతుంది. కోల్‌ కతాలోని ఓ యువతికి గర్భవతిగా ఉన్నప్పుడు డెంగ్యూ సోకింది.

ఆమె ఆసుపత్రిలో చేరే సమయానికే ఆమె ప్లేట్‌లెట్ల సంఖ్య 40 వేలకు పడిపోయింది. ఆమె ఆసుపత్రిలో చేరిన నాలుగో రోజున అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్స్‌ ఆమెకు ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే ఆమెది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. దాంతో ఆమెకు వైద్యులు పలు రకాలు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆమెకు డెంగ్యూగా నిర్థారణ అయ్యింది.

అనుమానం వచ్చిన వైద్యులు బిడ్డకు కూడా పరీక్షలు నిర్వహించడంతో బిడ్డకు కూడా పాజిటివ్‌ గా వచ్చింది. తల్లి నుంచి డెంగ్యూ సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో డాక్టర్స్ బిడ్డకు ఐవీ థెరపీ నిర్వహించారు. దీంతో బిడ్డ మామూలు స్థితికి చేరుకుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వివరించారు. బిడ్డ ఆరోగ్యంగా 2.7 కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. వారిని ఇంటికి పంపినట్లు వైద్యులు తెలిపారు.

అరుదైన సందర్భాలలో మాత్రమే తల్లి ప్లాసెంటా నుంచి కడుపులోని బిడ్డకు ప్రసవానికి ముందు కానీ, ప్రసవ సమయంలో కానీ, డెలివరీ అయ్యాక కానీ సోకే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో తల్లి ప్లాసెంటా ద్వారా బిడ్డకు వైరస్ సోకి ఉండవచ్చని వైద్యుల అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు