Delhi: ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు–కేంద్రం నిర్ణయం

ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే విదేశీ విమానయానాల మీద కూడా జీఎస్టీ తగ్గే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

BUDGET 2024: భూముల పరిరక్షణ కోసం కొత్త పథకం.. కీలక ప్రకటన
New Update

ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది.అలాగే 2,000 కంటే ఎక్కువ ఆన్‌లైన్ చెల్లింపులపై పన్ను విధించే ప్రతిపాదన ఇంకా జీఎస్టీ నుండి విదేశీ విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించాలని వంటి కీలక నిర్ణయాలను ప్యానెల్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటు ఆర్థిక శాఖకు చెందిన కీలక అధికారులు హాజరయ్యారు.

ఇన్సూరెన్స్ పాలసీలకు జీఎస్టీ తగ్గించే అంశంపై అక్టోబర్ నెలాఖరు నాటికి జీఎస్టీ కౌన్సిల్ నివేదిక ఇవ్వనుంది. GOM ఇచ్చిన నివేదికపై నవంబర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. దాని తరువాత క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  క్యాన్సర్ ఔషధాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించినట్లు తెలిపింది. 2026 మార్చి తర్వాత జీఎస్టీ పరిహార సెస్ ను కొనసాగించాలా వద్దా అనే దానిపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు.

Also Read:

#finance-minister #gst #nirmala-sitaramana #health-insurence
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe