South Central Railway: రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక సూచన చేసింది. మూడో లైను పనుల కారణంగా మే 27నుంచి 30 వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు 07462/63 వరంగల్-సికింద్రాబాద్ పుష్ పుల్ రైలు, 17035/36 కాజీపేట-బల్లార్షా, 07766/65 కరీంనగర్- సిర్పూర్ టౌన్, 07894 కరీంగనర్ -బోధన్ రైలు వచ్చే నెల 30 వరకూ క్యాన్సిల్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
అలాగే ఏపీలో పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో గల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. 07977/07978 నెంబర్‌గల విజయవాడ-బిట్రగుంట మధ్య నడిచే ట్రైన్స్ మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేశారు. వీటితోపాటు మే 27 నుంచి 31 వరకు, జూన్ 3 నుంచి 7 వరకు, జూన్ 10 నుంచి 14 వరకు.. జూన్ 17 నుంచి జూన్ 21 వరకు 17237/17238 అనే నెంబర్‌గల బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ట్రైన్స్ రద్దయినట్లు తెలిపారు. గుంటూరు-రాయగడ 17243/17244 ట్రైన్స్ కూడా మే 27 నుంచి జూన్ 24 వరకు రద్దయ్యాయి. కాకినాడ పోర్ట్- విశాఖపట్నం మధ్య నడిచే 17267/17268 ట్రైన్స్ కూడా రద్దు చేశారు.