Electric cars in india : మనదేశంలో ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ నడుస్తోంది. కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం పెరుగుతున్న డిజీల్, పెట్రోల్ ధరల నుంచి తప్పించుకునేందుకు వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అనేక ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే కస్టమర్లు ఇంకా 5 ఎలక్ట్రిక్ కార్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటిలో టాటా, మహీంద్రా, మారుతి సుజుకీ కార్లు కూడా ఉన్నాయి. ఈ 5 కార్లను ఈ ఏడాది విడుదల చేయనున్నాయి కంపెనీలు. ఈ కార్లు మారుతి సుజుకి EVX, స్కోడా ఇనియాక్, టాటా హారియర్ EV, టాటా కర్వ్ EV, మహీంద్రా XUV800 ఉన్నాయి.
మహీంద్రా XUV.E8:
మహీంద్రా & మహీంద్రా ఈ ఏడాది ఆగస్ట్‌లో మహీంద్రా XUV.E8ని భారతదేశంలో అలాగే గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ టెస్టింగ్‌లో మోడ్ లో ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV XUV700ను పోలి ఉంటుంది. లుక్స్, ఫీచర్ల పరంగా ఇది చాలా బాగుంటుందని భావిస్తున్నారు.
టాటా హారియర్ EV:
టాటా మోటార్స్ ఈ సంవత్సరం దాని శక్తివంతమైన మధ్యతరహా SUV హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను పరిచయం చేయబోతోంది. ఇది ఇటీవల ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రదర్శనకు వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ SUV శక్తివంతమైన బ్యాటరీతో వస్తుంది. దాని సింగిల్ ఛార్జ్ పరిధి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
టాటా కర్వ్ EV (టాటా కర్వ్ ev):
ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో టాటా కర్వ్ ను పరిచయం చేసింది కంపెనీ . కర్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్‌లను ఈ ఏడాది భారతదేశంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. టాటా కర్వ్ EV పరిధి, వేగంలో Nexon EV కంటే మెరుగ్గా ఉంటుంది.
మారుతి సుజుకి EVX:
మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారును EVX రూపంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఈ కారును విడుదల చేస్తారని భావిస్తున్నారు. మారుతి సుజుకి EVX 400 కిలోమీటర్ల వరకు ఒకే ఛార్జ్ పరిధితో అందిస్తుంది.
స్కోడా ఎన్యాక్:
స్కోడా ఆటో ఇండియా తన ఎలక్ట్రిక్ SUV ఇనిక్‌ని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించింది. ఇది ఈ ఏడాది ప్రీమియం EV విభాగంలోకి ప్రవేశించవచ్చు.
ఇది కూడా చదవండి: కెనడాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు భారతీయులు దుర్మరణం..!!